పరంపర ఫౌండేషన్ హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో భారతీయ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన పరంపర భరతనాట్య ప్రదర్శనను దిగ్విజయంగా ప్రదర్శించింది. ఆ నాట్య ప్రదర్శనతో ఆ ఆలయం ప్రకాశవంతంగా వెలిగిపోతున్నట్లుగా ప్రశాంతతో కూడిన ఆధ్యాత్మిక తొణికిసలాడింది. కొండల మధ్య నెలకొన్న ఆలయంలో రాత్రిపూట జరిగిన ఈ ప్రదర్శన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధిల్ని చేసింది.
ఈ నాట్యంతో వాతావరణ మార్పు ఆవశక్యత, పర్యావరణ బాధ్యత, మాతృభూమి పట్ల గౌరవాన్ని ప్రస్తావించింది. ఇది అందిరి సమిష్ట బాధ్యత అని నొక్కిచెప్పేలా నాట్యాన్ని ప్రదర్శించారు. ఇక గురు సుజాత శ్రీనివాసన్, డాక్టర్ శ్రేయ శ్రీనివాసన్ సహకారంతో ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన నృత్యాకారులు బృందం ప్రదర్శించింది.

చివరగా అమెరికాలోని నాట్యాంజలి కూచిపూడి నృత్య పాఠశాలకు చెందిన శ్రీలత సూరి ఆధర్వంలో నృత్యాకారులు బృందం, సూర్యాష్టకం, మీనాక్షి పంచరత్నం, భూదేవి వరాహ ప్రీమియర్ వంటి ఆధ్యాత్మిక అంశాలతో కూడిన కూచిపూడి నృత్యాన్ని ప్రేక్షకులను రంజింప చేసేలా ప్రదర్శించారు.
(చదవండి: మానవత్వం, ప్రకృతి మధ్య సంభాషణను నృత్య రూపకంగా..!)


