హైదరాబాద్‌లో రూ.350 కోట్లతో లగ్జరీ హోటల్‌ | Mindspace REIT to Invest Rs 350 Crore in Hyderabad Luxury Hotel | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో రూ.350 కోట్లతో లగ్జరీ హోటల్‌

Feb 26 2026 8:25 PM | Updated on Feb 26 2026 8:33 PM

Mindspace REIT to Invest Rs 350 Crore in Hyderabad Luxury Hotel

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌ హైదరాబాద్‌లో దాదాపు రూ. 350 కోట్లతో లగ్జరీ హోటల్‌ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. దీన్ని చాలెట్‌ హోటల్స్‌కి ప్రీ–లీజుకి ఇచ్చినట్లు తెలిపింది. 5.3 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాజెక్టులో 330 గదులు ఉంటాయి. 2027–28 నాలుగో త్రైమాసికంలో ఇది పూర్తయ్యే అవకాశం ఉందని మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌ తెలిపింది.

ఇరు సంస్థల మధ్య ఒప్పందం ప్రకారం మైండ్‌స్పేస్‌ రీట్‌కి చెందిన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ సంస్థ సదరు ప్రాపరీ్టని స్థూలంగా నిర్మించి ఇస్తుంది. ఇంటీరియర్స్, హోటల్‌ నిర్వహణ మొదలైన పనులను చాలెట్‌ చేపడుతుంది. ప్రస్తుతం చాలెట్‌కి మొత్తం మీద 3,300 గదుల పోర్ట్‌ఫోలియో ఉంది. మైండ్‌స్పేస్‌ రీట్‌కి హైదరాబాద్‌తో పాటు ముంబై, పుణె చెన్నైలలో ఆఫీస్‌ అసెట్స్, బిజినెస్‌ పార్క్‌లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement