జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. షాపింగ్‌ మాల్స్‌ మంటలు | Fire Mishap at Road number 36 Jubilee Hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. షాపింగ్‌ మాల్స్‌ మంటలు

Feb 26 2026 11:42 AM | Updated on Feb 28 2026 1:20 PM

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్‌-36లో ఉన్న ప్రముఖ దుస్తుల బ్రాండ్‌ మాన్యవర్‌  షోరూం,  మంగళగౌరీ షాపింగ్‌ మాల్‌లో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

అగ్ని ప్రమాదం కారణంగా షాపింగ్‌ మాల్‌ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపింగ్‌ మాల్‌కు పక్కనే ఉన్న భవనాలకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు.. మంటల్లో షాపింగ్‌ మాల్‌ సిబ్బంది చిక్కుకున్నట్టు సమాచారం. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement