నాకూ ప్రేమించాలని ఉంది: ప్రభాస్‌ | Actor Prabhas Want to Fall in Love | Sakshi
Sakshi News home page

Prabhas: ప్రేమలో పడాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన ప్రభాస్‌

Feb 20 2026 12:24 PM | Updated on Feb 20 2026 12:35 PM

Actor Prabhas Want to Fall in Love

ఇండియాలోనే మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ ప్రభాస్‌. ఎంతసేపు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడే తప్ప పర్సనల్‌ లైఫ్‌ను పట్టించుకోవడమే మానేశాడు. 46 ఏళ్లు వచ్చినా ఇంతవరకు పెళ్లి ముచ్చటే లేదు. ఆ ప్రస్తావన వచ్చినా కూడా ఓ చిన్న నవ్వు నవ్వి దాటవేస్తుంటాడు. కానీ ఈసారి మాత్రం తనకు ప్రేమలో పడాలని ఉందంటున్నాడు.

స్పెషల్‌ ఇంటర్వ్యూ
టాలీవుడ్‌లో ఇటీవల విడుదలై హిట్‌ కొట్టిన మూవీ కపుల్‌ ఫ్రెండ్లీ. సంతోశ్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ క్రమంలోనే చిత్రనిర్మాణ సంస్థ అయిన యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌ ప్రభాస్‌తో స్పెషల్‌ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది.

ప్రేమలో పడాలనుంది
ఈ సందర్భంగా కపుల్‌ ఫ్రెండ్లీ హీరోయిన్‌ మానస.. ప్రభాస్‌ను ప్రేమ గురించి అభిప్రాయం అడిగింది. అందుకు సమాధానంగా ప్రభాస్‌.. ఇది నీ పర్సనల్‌ క్వశ్చన్‌ కదా అని నవ్వేశాడు. అలాగే తనకు ప్రేమించాలనుందని, ప్రేమలో పడాలనుందని మనసులో మాట బయటపెట్టాడు. ఈ కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రభాస్‌ ప్రేమలో పడితే చూడాలనుందని అభిమానులు కూడా ఆశపడుతున్నారు.

చదవండి: చిరంజీవి, మోహన్‌లాల్‌.. బెస్ట్‌ యాక్టర్‌ ఎవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement