తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, కాపర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే మీ జుట్టు తెల్లరంగులోకి మారినట్లయితే.. ఇంట్లో దొరికే పదార్థాలతోనే జుట్టుకు సహజ రంగును తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే...
ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల టీపొడి, మూడు టేబుల్ స్పూన్ల ఉసిరిపొడి, రెండు టేబుల్ స్పూన్లు ఆవనూనె తీసుకోవాలి.
తయారీ విధానం: ముందుగా ఒక ఇనుప కడాయిలో నల్ల నువ్వులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత టీపొడి, ఉసిరి పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూడింటిని మీడియం మంట మీద వేయించాలి. మిశ్రమం పూర్తిగా నల్లగా మారినప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలి. చల్లబడిన తర్వాత మిక్సర్‌లో వేసుకుని బాగా గ్రైండ్ చేసి, జల్లించుకుని గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి.
రెండు చెంచాల పొడిని తీసుకుని.. ఆవాల నూనెలో కలిపి పేస్టులా తయారు చేసి, జుట్టుకంతటికీ బాగా పట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం ఎప్పటిలాగే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. నువ్వులు, టీపొడి, ఉసిరి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సాయపడతాయి. దీనితో ఎటువంటి దుష్ఫలితాలూ ఉండవు
నునుపైన మెడకోసం...
ఒక బంగాళదుంపని పొట్టు తీయకుండా ఉడకబెట్టి,మెత్తగా మెదుపుకోవాలి. దీనికి కాసిని పాలు, కొద్దిగాకొబ్బరినూనె జతచేసి పేస్ట్‌లా కలపాలి. మెడపై ఈమిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరువాతకడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మెడనలుపు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది.
(చదవండి: వెనెజువెలాలో 'ఏంజెల్' జలపాతం..! చేరుకోవడం అంత ఈజీ కాదు..)


