ముఖానికి ఎంత సన్‌స్క్రీన్‌ అప్లై చేస్తున్నారు..? | How Much Sunscreen Should You Apply On Your Face And Neck | Sakshi
Sakshi News home page

ముఖానికి ఎంత సన్‌స్క్రీన్‌ అప్లై చేస్తున్నారు..? చర్మవ్యాధి నిపుణులు ఏమంటున్నారంటే..

Feb 2 2026 4:52 PM | Updated on Feb 2 2026 5:31 PM

How Much Sunscreen Should You Apply On Your Face And Neck

చర్మ సంరక్షణ ఉత్పత్తులు మనకు మంచి ఫలితాలివ్వాలంటే ఎంత పరిమాణంలో ఉపయోగిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి సంరక్షించే ఉత్పత్తుల విషయంలో ఫలితాలు మెరుగ్గా ఉండాలంటే ఎంత పరిమాణంలో రాయాలనేది తెలుసుండాలి. లేదంటే అంతలా ఖర్చు చేసి.. కొన్నవి కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు. 

పైగా చర్మ సమస్యలు మరింత ఉత్పన్నమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఏబ్యూటీ ప్రొడక్ట​ అయినా..రాసే పరిమాణం మీదే ఫలితం ఆధారపడి ఉంటుందనేది గుర్తెరగాలి అని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు. అంతేగాదు ఎంతపరిమాణంలో రాయాలో కూడా సవివరంగా ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించారు చర్మ వైద్యనిపుణురాలు డాక్టర్ గుర్వీన్ వారైచ్‌. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దాం.

చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో సన్‌స్క్రీన్ అత్యంత ముఖ్యమైనది. ఇది చర్మాన్ని సూర్యుడి నుంచి రక్షించడమే కాకుండా చర్మ పొరను కాపాడుతుంది, నల్లబడటాన్ని నివారిస్తుంది. అలాగే అతినీలలోహిత కిరణాల(యూవీబీ) నుంచి రక్షిస్తుంది. అది ఎంత ఖరీదైన బాటిల్‌ అయినా,  ఎంత ఎస్పీఎఫ్‌ అందించినా..సరైన మోతాదులో అప్లై చేయడం అనేది అత్యంత కీలకం అని చెబుతున్నారు చర్మవ్యాధి నిపుణురాలు.

ఎంత సన్‌స్క్రీన్ అప్లై చేయాలంటే..
చర్మవ్యాధి నిపుణులరాలు గుర్వీన్‌ ప్రకారం..ప్రతి చదరపు సెంటీమీటర్‌కు 2మిల్లీగ్రాములు సరైన పరిమాణం. అంటే ముఖం, మెడకు కలిపి..మొత్తం 1.6 నుంచి 1.8 mg అవసరం. ఇది సుమారుగా మూడు వేళ్లకు సమానం. ఈ మోతాదులో ముఖానికి అప్లై చేయకపోతే తగిన ప్రయోజనం పొందలేరని అన్నారామె. మనం ఎంత ఖరీదైనది, సన్‌స్క్రీన్‌ ఎస్పీఎఫ్‌ 50 అయినా సరే తగిన పరిమాణంలో ఉపయోగించకపోతే మెరుగైన ఫలితం మాత్రంపొందలేమని అన్నారు. 

ప్రయోజనాలు..
SPF 30 ఉన్న సన్‌స్క్రీన్ రోజువారీ ఉపయోగం కోసం సరిపోతుంది. ఎండలో ఎక్కువగా ఉండేవారికి SPF 60 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది. ఇలా ఈ సన్‌స్క్రీన్‌ అప్లై యడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. అదెలాగంటే..

  • చర్మ రక్షణకు అవరోధంగా ఉన్న వాటిని నివారిస్తుంది. తామర, రోసేసియా, మొటిమలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. 

  • యూవీబీ కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మ కేన్సర్‌ అవకాశాలను తగ్గిస్తుంది. 

  • గోధుమ రంగు మచ్చలు, చక్కటి గీతలు, ముడతలు, వర్ణద్రవ్యం వంటి అకాల వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో సహాయపడుతుంది.

(చదవండి: మాటే మంత్రమై.. ఆ బిడ్డకు ఊపిరి పోసింది..! సినిమాని తలపించే ఘట్టం)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement