breaking news
sunscreen
-
సూర్యుడికే సన్‌స్క్రీన్!
ప్రకృతి వైపరీత్యాలు, అడవుల నరికివేత, విచ్చలవిడి కాలుష్యాలతో భూగోళం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భూతాపం నానాటికీ పెరిగి పోతుండటంతో, రాబోయే కాలంలో మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో, భూమిని ఎలాగైనా చల్లబరచాలనే పట్టుదలతో శాస్త్రవేత్తలు అత్యంత వినూత్నమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి ఒక ప్రయోగమే ‘సూర్యుడి కాంతిని తగ్గించడం’!అయితే, ప్రపంచాన్ని రక్షించేందుకు ఉద్దేశించిన ఈ ‘జియోఇంజనీరింగ్’ ప్లాన్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనివల్ల విమాన ప్రయాణికులు, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడికి సన్‌స్క్రీన్ వేయటంలా అనిపించే ఈ ప్రయోగం వల్ల ఆకాశంలో ప్రమాదకరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ (గంధక ఆమ్లం) మబ్బులు ఏర్పడతాయి. అవి ఎంతో హానికరమైనవి.సూర్యుడిని ఎలా ‘డిమ్’ చేస్తారు!ప్రస్తుతం కేవలం కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా మాత్రమే భూమి వేడెక్కడాన్ని ఆపడానికి మనకు సరిపడా సమయం లేదు. అందుకే, వాతావరణంలో చిక్కుకునే వేడిని తగ్గించడం కంటే.. అసలు సూర్యుడి నుండి భూమికి వచ్చే కాంతిని, వేడిని ముందే అడ్డుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి పుట్టిందే ఈ జియోఇంజనీరింగ్ బృహత్ప్రణాళిక. స్ట్రాటోస్పియరిక్ ఏరోసోల్ ఇంజెక్షన్ (ఎస్.ఎ.ఐ) అనే ఈ విధానంలో ఆకాశంలోని పైపొరల్లోకి (స్ట్రాటోస్పియర్) ప్రత్యేక విమానాల ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ వాయువును భారీ మొత్తంలో విడుదల చేస్తారు.ఆ వాయువు గాల్లోని తేమతో కలిసి చిన్న చిన్న సల్ఫేట్ కణాలుగా (ఏరోసోల్స్) మారుతుంది. గతంలో భూమిపై పెద్ద అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఎలాగైతే పొగ, బూడిద ఆకాశాన్ని కమ్మేసి కొన్ని నెలల పాటు భూమిని చల్లబరిచాయో, అదే ఫార్ములాను ఇక్కడ కృత్రిమంగా అమలు చేస్తున్నారు. ఈ కెమికల్ కణాలు ఒక అద్దంలా పనిచేసి, సూర్యకాంతిని తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందేలా చేస్తాయి. దాంతో భూమిపై వేడి తగ్గుతుంది.మానవాళికి కొత్త చిక్కులుభూమిపై మనం నివసించే దిగువ వాతావరణ పొరను ‘ట్రోపోస్పియర్’ అంటారు. ఇక్కడ వర్షాలు పడటం వల్ల కాలుష్యం త్వరగానే కిందకి వచ్చేస్తుంది. కానీ, దీనికి పైన ఉండే ‘స్ట్రాటోస్పియర్’ పొరలో అసలు వర్షాలు పడవు. కాబట్టి మనం అక్కడ వెదజల్లే రసాయన జల్లులు సాధారణ కాలుష్యం కంటే 50 రెట్లు ఎక్కువ కాలం గాల్లోనే ఉండిపోతాయి. ఇది భూమిని చల్లబరచడానికి మంచిదే అయినప్పటికీ, మానవాళికి సరికొత్త తలనొప్పులను తెచ్చిపెడుతుంది. శాస్త్రవేత్తలు ఊహించిన ఈ అద్భుతమైన ప్రణాళికలో అసలు ప్రమాదం విమాన ప్రయాణాల దగ్గరే మొదలవుతుంది.సాధారణ కమర్షియల్ (ప్యాసింజర్) విమానాలు ఆకాశంలో ప్రయాణించేటప్పుడు, ప్రయాణికులకు కావలసిన ఆక్సిజన్ కోసం బయట ఉండే గాలిని వాటి శక్తిమంతమైన ఇంజిన్లు లోపలికి లాక్కుంటాయి. ఆ గాలిని ఫిల్టర్ చేసి, ప్రయాణికులు, సిబ్బంది సులభంగా శ్వాస తీసుకోవడానికి వీలుగా క్యాబిన్ లోపలికి పంపుతాయి. ఒకవేళ విమానాలు ప్రయాణించే ఆకాశ మార్గంలో సల్ఫర్ డయాక్సైడ్ మబ్బులు ఉంటే, విమాన ఇంజన్లు ఆ వాయువును కూడా లోపలికి లాగేసుకుంటాయి.ఆ వాయువు విమానం కంప్రెషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లోకి వెళ్లినప్పుడు, అక్కడ ఉండే విపరీతమైన వేడి, తేమ కారణంగా రసాయన చర్య జరిగి క్షణాల వ్యవధిలో ఘాటైన సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగా మారిపోతుంది. అంటే, ప్రయాణికులు శ్వాసించే గాలిలోకి నేరుగా యాసిడ్ కణాలు ప్రవేశిస్తాయన్న మాట! దీనివల్ల విమానం లోపల ఉన్న వారికి ఊపిరాడకుండా పోయే ప్రమాదం ఉందని, ముఖ్యంగా – తరచూ ప్రయాణించే వారికి ఇది శాపంగా మారుతుందని న్యూజెర్సీలోని రట్జర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలన్ రోబాక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్యాసింజర్ రూట్లలోనే ‘విషాయన’ మబ్బులుభూమధ్యరేఖ పైభాగంలో దాదాపు 1.2 కోట్ల టన్నుల సల్ఫర్ డయాక్సైడ్ను వదిలితే, భూమి ఉష్ణోగ్రతను 0.6 నుండి 1 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గించవచ్చు. దీనివల్ల ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల ప్యారిస్ ఒప్పందం నిర్దేశించిన 1.5 డిగ్రీల లోపే ఉంటుంది. ఇక ఈ ఏరోసోల్ను భూమికి దాదాపు 13 నుండి 15 కిలోమీటర్ల (8 నుండి 9 మైళ్ల) ఎత్తులో వదలాల్సి ఉంటుంది. సాధారణ ప్యాసింజర్ విమానాలు అంత ఎత్తుకు వెళ్లలేవు. దీనికి ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు మరో మార్గాన్ని వెతికారు.భూమి ధ్రువ ప్రాంతాల (ఉత్తర, దక్షిణ ధ్రువాలు) వద్ద స్ట్రాటోస్పియర్ పొర భూమికి కాస్త దగ్గరగా (తక్కువ ఎత్తులో) ఉంటుంది. కాబట్టి, బోయింగ్ 777 వంటి భారీ విమానాలను ఉపయోగించి ఆ ధ్రువ ప్రాంతాల వద్ద సల్ఫర్‌ను సులభంగా ఆకాశంలోకి వదలవచ్చని భావిస్తున్నారు. ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఉత్తర అమెరికా (అమెరికా, కెనడా) నుండి యూరప్, ఆసియా దేశాలకు వెళ్లే వందలాది ప్యాసింజర్ విమానాలు ప్రయాణించేది కూడా సరిగ్గా అదే ధ్రువ ప్రాంతాల రూట్లలోనే! దీనివల్ల సాధారణ విమానాలు తమకు తెలియకుండానే అకస్మాత్తుగా ఆకాశంలో దట్టంగా పేరుకుపోయిన సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ జోన్లలోకి దూసుకెళతాయి. ఈ రసాయనాలను ఆకాశంలో పొడవాటి గీతల్లా చల్లుకుంటూ వెళ్తారు కాబట్టి, కొన్ని చోట్ల ఈ గ్యాస్ అంచనాలకు మించి అత్యంత గాఢతతో ఉండే అవకాశం ఉంది.పక్షవాతం, గుండెపోటు ముప్పు!ప్రొఫెసర్ రోబాక్ లెక్కల ప్రకారం ఈ రసాయనాలను చల్లిన కొత్తలో కొన్ని ప్రాంతాలలో వీటి గాఢత ఒక క్యూబిక్ మీటరుకు 50 మైక్రోగ్రాముల వరకు పెరిగిపోతుంది. ఇది యూరోపియన్ యూనియన్ పర్యావరణ, ఆరోగ్య ప్రమాణాల ప్రకారం మానవ ఆరోగ్యానికి అత్యంత హానికరమైన స్థాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ మిశ్రమం ఉన్న గాలిని పీల్చడం వల్ల గొంతు, ముక్కు, ఊపిరితిత్తులు తీవ్రంగా మంట పుడతాయి.ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇది తక్షణమే ‘ఆస్తమా ఎటాక్’కు దారితీసి ప్రాణాంతకంగా మారుతుంది. రసాయన ప్రభావం వల్ల శ్వాస నాళాలు ముడుచుకుపోయి, ఊపిరి తీసుకోవడం అసాధ్యంగా మారుతుంది. పదే పదే లేదా ఎక్కువ సమయం ఈ యాసిడ్ ప్రభావం ఉన్న వాతావరణంలో గడపడం వల్ల రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు దెబ్బతినడం జరిగి పక్షవాతం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా వారంలో చాలా గంటలు ఆకాశంలోనే గడిపే పైలట్లు, ఎయిర్ హోస్టెస్‌లు, క్యాబిన్ క్రూ సిబ్బంది ఈ భయంకరమైన ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.విమానానికేం కాదు కానీ..!సల్ఫ్యూరిక్ యాసిడ్‌కు లోహాలను, వస్తువులను క్షీణింపజేసే గుణం ఉంటుంది. అయితే, ఆకాశంలో ప్రయాణించే విమానాల బాడీకి లేదా లోహ భాగాలకు ఈ మోతాదు వల్ల ఎలాంటి నష్టమూ వాటిల్లదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విమానాలకు భౌతికంగా ఏం కాకపోవచ్చు కానీ, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం మాత్రం ఉందని కొలంబియా క్లైమేట్ స్కూల్ తల్చేసింది. ధ్రువ ప్రాంతాల వద్ద ఏరోసోల్స్ వదలడం వల్ల ఉష్ణమండల దేశాలలో (భారతదేశం వంటి దేశాలలో) వచ్చే రుతుపవనాలు దెబ్బతిని, తీవ్ర కరువు లేదా అకాల వరదలు రావచ్చు.అయితే, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ వాతావరణ పరిశోధకుడు డాక్టర్ వేక్ స్మిత్ మాత్రం ఈ ప్రయోగాన్ని ఇప్పుడే పూర్తిగా పక్కన పెట్టేయకూడదంటున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, భూతాపం అనే పెద్ద రాక్షసుడిని చంపడానికి ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులను మనం ఎదుర్కోక తప్పదు.ఏమైనప్పటికీ, ప్రకృతి శక్తులతో మానవుడు కృత్రిమంగా ఆడుకోవాలనుకున్నప్పుడు ఊహించని సవాళ్లు ఎదురవడం సహజం. మరి భవిష్యత్తులో సైన్స్ ఈ సమస్యకు ఎలాంటి సురక్షితమైన పరిష్కారాన్ని చూపుతుందో చూడాలి.జియోఇంజనీరింగ్ అంటే?భూతాపాన్ని తగ్గించేందుకు భూవాతావరణ ప్రక్రియలను కృత్రిమంగా, భారీ ఎత్తున మార్చడాన్నే ‘జియోఇంజనీరింగ్’ అంటారు. సూర్యకాంతిని వెనక్కి తిప్పి పంపడానికి ఆకాశంలో రసాయన కణాలు చల్లడం, లేదా గాల్లోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకునేలా సముద్రపు రసాయనిక శక్తిని మార్చడం వంటివి ఇందులో ముఖ్యమైనవి. అయితే, ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ ప్రయోగాలు వికటిస్తే, సమస్య పరిష్కారం కాకపోగా వాతావరణం మరింత వినాశకరంగా మారే ప్రమాదం ఉందని పరిశోధకులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జియోఇంజనీరింగ్ లోపాలు..వాతావరణ మార్పులతో పోరాడటానికి శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరిష్కారాలను ప్రతిపాదించారు. వాటిలో కొన్ని వివాదాస్పద పద్ధతులు కూడా ఉన్నాయి. అడవుల పెంపకంఆస్ట్రేలియా, ఉత్తర ఆఫ్రికా వంటి ప్రాంతాల్లోని ఎడారులకు నీటిని అందించి, అక్కడ లక్షలాది చెట్లను నాటుతారు. ఈ చెట్లు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి.లోపం: సాధారణంగా ఎడారులు సూర్యకాంతిని తిరిగి అంతరిక్షంలోకి పంపేస్తాయి (రిఫ్లెక్ట్ చేస్తాయి). కానీ అక్కడ చెట్లు పెంచితే, అవి సూర్యకాంతిని లోపలికి లాక్కుంటాయి. దీనివల్ల భూమి మరింత వేడెక్కే ప్రమాదం ఉంది.కృత్రిమ సముద్ర ఉప్పెనపెద్ద పెద్ద పైపులను ఉపయోగించి సముద్రం అడుగున ఉండే చల్లటి, పోషకాలు దట్టంగా ఉండే నీటిని పైకి పంపిస్తారు. ఇది సముద్రం పైపొరల్లోని నీటిని చల్లబరుస్తుంది.లోపం: ఈ ప్రక్రియ గనుక ఎప్పుడైనా మధ్యలో ఆగిపోతే, సముద్రాలు తమ వేడిని ఒక్కసారిగా సర్దుబాటు చేసుకోవడం వల్ల వాతావరణం చాలా వేగంగా, అస్తవ్యస్తంగా మారిపోతుంది.సముద్ర క్షారీకరణసముద్రాలలో పెద్ద ఎత్తున సున్నాన్ని కలపడం ద్వారా.. నీటికి కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువగా పీల్చుకునే రసాయనిక శక్తిని పెంచుతారు.లోపం: ప్రపంచ ఉష్ణోగ్రతలను తగ్గించడంలో ఈ పద్ధతి పెద్దగా ఉపయోగపడదని పరిశోధనలు చెప్తున్నాయి.సముద్రంలో ఇనుమును వేయడంసముద్రాలలో ఇనుమును వేయడం ద్వారా, కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకునే చిన్న చిన్న మొక్కలు/జీవుల ఎదుగుదలకు పుష్టిని అందిస్తారు.లోపం: ఈ పద్ధతి కూడా భూమి వేడిని తగ్గించడంలో అంతగా పని చేయదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.సూర్య కిరణాల నియంత్రణఆకాశంలోకి సూర్యకాంతిని తిరిగి వెనక్కి తిప్పి పంపే సల్ఫేట్ కణాలను వాతావరణంలోకి వదలడం ద్వారా భూమికి వచ్చే ఎండ తీవ్రతను తగ్గిస్తారు.లోపం: దీనివల్ల భూమి చల్లబడవచ్చు కానీ, వాతావరణంలో పేరుకుపోయే కార్బన్ డయాక్సైడ్ సమస్య మాత్రం అలాగే ఉండిపోతుంది.- సాక్షి స్పెషల్ డెస్క్ -
ముఖానికి ఎంత సన్‌స్క్రీన్ అప్లై చేస్తున్నారు..?
చర్మ సంరక్షణ ఉత్పత్తులు మనకు మంచి ఫలితాలివ్వాలంటే ఎంత పరిమాణంలో ఉపయోగిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి సంరక్షించే ఉత్పత్తుల విషయంలో ఫలితాలు మెరుగ్గా ఉండాలంటే ఎంత పరిమాణంలో రాయాలనేది తెలుసుండాలి. లేదంటే అంతలా ఖర్చు చేసి.. కొన్నవి కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు. పైగా చర్మ సమస్యలు మరింత ఉత్పన్నమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఏబ్యూటీ ప్రొడక్ట అయినా..రాసే పరిమాణం మీదే ఫలితం ఆధారపడి ఉంటుందనేది గుర్తెరగాలి అని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు. అంతేగాదు ఎంతపరిమాణంలో రాయాలో కూడా సవివరంగా ఇన్స్టాగ్రాం వేదికగా వెల్లడించారు చర్మ వైద్యనిపుణురాలు డాక్టర్ గుర్వీన్ వారైచ్. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దాం.చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో సన్‌స్క్రీన్ అత్యంత ముఖ్యమైనది. ఇది చర్మాన్ని సూర్యుడి నుంచి రక్షించడమే కాకుండా చర్మ పొరను కాపాడుతుంది, నల్లబడటాన్ని నివారిస్తుంది. అలాగే అతినీలలోహిత కిరణాల(యూవీబీ) నుంచి రక్షిస్తుంది. అది ఎంత ఖరీదైన బాటిల్ అయినా, ఎంత ఎస్పీఎఫ్ అందించినా..సరైన మోతాదులో అప్లై చేయడం అనేది అత్యంత కీలకం అని చెబుతున్నారు చర్మవ్యాధి నిపుణురాలు.ఎంత సన్‌స్క్రీన్ అప్లై చేయాలంటే..చర్మవ్యాధి నిపుణులరాలు గుర్వీన్ ప్రకారం..ప్రతి చదరపు సెంటీమీటర్‌కు 2మిల్లీగ్రాములు సరైన పరిమాణం. అంటే ముఖం, మెడకు కలిపి..మొత్తం 1.6 నుంచి 1.8 mg అవసరం. ఇది సుమారుగా మూడు వేళ్లకు సమానం. ఈ మోతాదులో ముఖానికి అప్లై చేయకపోతే తగిన ప్రయోజనం పొందలేరని అన్నారామె. మనం ఎంత ఖరీదైనది, సన్‌స్క్రీన్ ఎస్పీఎఫ్ 50 అయినా సరే తగిన పరిమాణంలో ఉపయోగించకపోతే మెరుగైన ఫలితం మాత్రంపొందలేమని అన్నారు. ప్రయోజనాలు..SPF 30 ఉన్న సన్‌స్క్రీన్ రోజువారీ ఉపయోగం కోసం సరిపోతుంది. ఎండలో ఎక్కువగా ఉండేవారికి SPF 60 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది. ఇలా ఈ సన్‌స్క్రీన్ అప్లై యడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. అదెలాగంటే..చర్మ రక్షణకు అవరోధంగా ఉన్న వాటిని నివారిస్తుంది. తామర, రోసేసియా, మొటిమలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. యూవీబీ కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మ కేన్సర్ అవకాశాలను తగ్గిస్తుంది. గోధుమ రంగు మచ్చలు, చక్కటి గీతలు, ముడతలు, వర్ణద్రవ్యం వంటి అకాల వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో సహాయపడుతుంది. View this post on Instagram A post shared by Dr Garekar l Dermatologist (@garekarsmddermatologyclinic)(చదవండి: మాటే మంత్రమై.. ఆ బిడ్డకు ఊపిరి పోసింది..! సినిమాని తలపించే ఘట్టం) -
Summer Care సన్‌స్క్రీన్ వాడాలా? వద్దా?
సమ్మర్ (Summer)లో సన్‌స్క్రీన్ (Sunscreen) లోషన్ వాడడం సర్వసాధారణం. 2030 నాటికి భారత సన్‌స్క్రీన్ మార్కెట్ బాగా పెరగనుందని ఒక నివేదిక అంచనా వేసింది. అయితే మరోవైపు చూస్తే... ఇంటర్నెట్లో ఒకవర్గం సన్‌స్క్రీన్ వాడొద్దు అని, వాటివల్ల జరిగే నష్టాలు ఇవి... అంటూ ప్రచారం చేస్తోంది. అందులో నిజం ఎంత?ప్రధానంగా రెండు రకాల సన్స్క్రీన్లు ఉన్నాయి. 1. మినరల్ 2. కెమికల్‌మినరల్ సన్‌స్క్రీన్‌లో జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్‌లాంటి క్రియాశీల ఖనిజ పదార్థాలు ఉంటాయి. ఇవి యువి కిరణాలను నిరోధిస్తాయి. ఇక కెమికల్ సన్స్క్రీన్లు అధికశక్తి గల యూవీ కిరణాలను గ్రహిస్తాయి. చర్మాన్ని దెబ్బతీయకుండా నిరోధిస్తాయి. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రియాశీల పదార్థాలు ఉంటాయి. ఇవేకాకుండా మార్కెట్లో కాంబినేషన్ సన్స్క్రీన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.డెర్మటాలజిస్ట్‌లు ‘సన్‌స్క్రీన్ వాడడం మంచిదే’ అని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.‘సన్‌స్క్రీన్‌లోని ఇన్‌గ్రేడియెంట్స్ థైరాయిడ్ హార్లోన్లు, టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్ స్థాయులను దెబ్బతీస్తాయని కొన్ని అధ్యయాలు సూచిస్తున్నాయి. అయితే ఇవి తక్కువస్థాయి ఆధారాలతో కూడిన ప్రాథమిక అధ్యయనాలు మాత్రమే. అందువల్ల సన్స్క్రీన్లు ఎండోక్రైన్ డిస్ట్రప్టర్లు అని నిర్దారించడానికి ఈ ఆధారాలు సరిపోవు’ అంటున్నారు డెర్మటలాజిస్ట్, ఇన్‌ఫ్లూయెంజ్ స్కిన్ అండ్ హేర్ క్లినిక్ ఫౌండర్ గీతికా శ్రీవాస్తవ.ఇదీ చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!జింక్‌ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ ఇన్‌గ్రేడియెంట్స్ ఉపయోగించే ఫిజికల్ సన్‌స్క్రీన్స్ (మినరల్ సన్‌స్క్రీన్స్) సురక్షితమైనవని, ప్రభావ వంతవైనవని ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్–రిసెర్చ్) నిర్ధారించింది. చదవండి : నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి? -
స్టైల్‌గా హోలీ!
బ్యూటిప్స్ ఏడురంగులు.. ఏ రంగు ఎటువైపుగా మన మేనిని తడుముతుందో తెలియదు. కానీ, తెలుపు రంగు దుస్తులను ధరిస్తే ఊహించనన్ని రంగులు డిజైన్లు డిజైన్లుగా ఆనందపు కెరటాల్లా అంటుకుపోతాయి. అందుకని తెల్లని సల్వార్, రంగుల బాందినీ ప్రింటెడ్ చున్నీ ధరిస్తే చాలు పండగ సంబరం రెట్టింపు అవ్వాల్సిందే! కాలే జీ యువతులైతే షార్ట్స్, వదులుగా ఉండే టీ షర్ట్ లేదా కుర్తా ఈ పండగకు నిరభ్యంతరంగా ధరించవచ్చు. అయితే, తప్పనిసరిగా లైట్ వెయిట్ కాటన్ మెటీరియల్ దుస్తులను ఇందుకోసం ఎంచుకోవాలి. కొద్దిగా ఆలివ్ ఆయిల్: హోలీ ఆడటానికి ముందు కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్‌ను మేనికి రాసుకోండి. ఇలా చేయడం వల్ల రంగుల వల్ల కలిగే మంట, దురద సమస్యలు ఉండవు. నూనె వల్ల కాసేపు చర్మం జిడ్డుగా అనిపిస్తుంది కానీ శుభ్రపరుచుకోవడం చాలా సులువు. చర్మకాంతి కూడా తగ్గదు. హోలీ రంగునీళ్ల నుంచి, ఎండవేడి నుంచి చర్మ సంరక్షణకు వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ మార్కెట్లో లభిస్తుంది. దీనిని ఉపయోగించవచ్చు. హెయిర్ స్టైల్: జుట్టును లూజ్‌గా వదిలేస్తే రంగులు అంటుకుపోయి, వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతింటుంది. హోలీ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. అందుకని ఫ్రెంచ్ పోనీటెయిల్ వేసుకుంటే స్టైల్‌గా కనిపిస్తారు. జుట్టు గురించిన ఆందోళనా తగ్గుతుంది. పండగ కళ రావాలంటే పోనీటెయిల్కు పూసలు, కుందన్స్ ఉన్న క్లిప్ లేదా బ్యాండ్‌ను వాడచ్చు. హోలీ ఆడటానికి ముందు జుట్టుకు కండిషనర్ వాడితే ఆ తర్వాత పాడవుతుందనే బెంగ ఉండదు. లేదంటే ముందుగా వెచ్చని కొబ్బరి నూనెను తలకంతా బాగా పట్టించాలి. దీనివల్ల వెంట్రుకలు మాయిశ్చరైజర్‌ను కోల్పోవు. -
'బ్యూ'టిప్స్
సమ్మర్ కేర్ బయటికెళ్లేటప్పుడు తలకు హ్యాట్ కాని క్యాప్కాని పెట్టుకుంటే కొంతలో కొంత రక్షణ ఉంటుంది.సమ్మర్లో పాదాలకు, వేళ్లకు గాలి తగిలే పాదరక్షలనే వాడాలి. ఫంక్షన్లకు వెళ్లేటప్పడు పాదం మొత్తాన్ని కవర్ చేసే ఫ్యాన్సీ శాండల్స్, షూస్ వేసుకోవాలంటే... వేళ్ల మధ్య టాల్కమ్ పౌడర్ చల్లాలి.ఎండ నుంచి కళ్లను రక్షించుకోవడానికి సన్‌గ్లాసెస్ వాడేవాళ్లకు కళ్ల చుట్టూ మినహా మిగిలిన ముఖమంతా ట్యాన్తో ప్యాచ్‌లా ఉంటుంది. కాబట్టి సన్‌గ్లాసెస్ ధరించడంతోపాటు ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. సమ్మర్ మేకప్‌లో ఐ లైనర్ పెన్సిల్ కలర్ కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మేకప్ హెవీ కాకుండా ముఖం తీరుగా కనిపింపచేయడంలో గ్రే, చాకొలేట్, నేవీ షేడ్లు ముఖ్యమైనవి.సాయంత్రం పార్టీలకు లూస్ షిమ్మర్ పౌడర్ వేసుకుని పెదవులకు లేత రంగు లిప్‌గ్లాస్ వేస్తే బాగుంటుంది.తప్పని సరిగా ఫౌండేషన్ వేసుకోవాలనుకుంటే... అందులో కొంచెం లూజ్ పౌడర్ కలిపి ముఖానికి అప్లయ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం జిడ్డుబారదు. రోజంతా తాజాగా కనిపించవచ్చు. -
మేని మెరుపులకు...
చర్మసౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు చాలా మంది. అయితే కొన్ని సార్లు చర్మాన్ని మెరుగు పెట్టే సౌందర్య ఉత్పాదనలు, ఇంట్లో చేసే చిన్న చిన్న చిట్కాల వల్ల కూడా హాని జరుగుతుంటుంది. అవగాహన లేమి దీనికి ప్రధాన కారణం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఏమేం చేయకూడదంటే... Right: చర్మం తెల్లగా అవ్వాలని, మృదువుగా అవ్వాలని స్క్రబ్(మార్కెట్లో రకరకాల స్క్రబ్‌లు అందుబాటులో ఉన్నాయి) తో అతిగా రుద్దుతుంటారు. దీని వల్ల చర్మం ఎర్రబడడమే కాకుండా పొడిబారుతుంది. మొటిమలు ఉంటే సమస్య మరింతగా పెరుగుతుంది. Wrong: రెండు వారాలకు ఒకసారి చర్మతత్త్వానికి సరిపడే స్క్రబ్ (మార్కెట్లో లభిస్తుంది) తో 2-3 నిమిషాలు మృదువుగా రుద్ది, శుభ్రపరుచుకోవాలి. మెటిమలు ఎక్కువగా ఉంటే స్క్రబ్ వాడకూడదు. వేపాకులను రుబ్బి, ముఖానికి రాసుకొని, ఆరాక శుభ్రపరచాలి. Right: చాలామంది తమ చర్మతత్వానికి సరిపడిన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్లు ఎంచుకోరు. దీని వల్ల సేదగ్రంథులు మూసుకుపోవడం, చర్మంపై దద్దుర్లు, పొక్కులు రావడం జరుగుతుంటాయి. Wrong: ఏదైనా కొత్త సౌందర్య ఉత్పత్తిని చర్మానికి ఉపయోగించే ముందు మోచేతిపై లేదా చెవి వెనకాల కొద్దిగా రాసి, 2-3 గంటల సేపు అలాగే ఉంచాలి. ఎరుపు దనం, దద్దుర్లు లేవని నిర్ధారించుకున్నాకే ఆ ఉత్పత్తిని వాడుకోవాలి. అలాగే, మాయిశ్చరైజర్ రాసిన వెంటనే ఫౌండేషన్ వాడకూడదు. మాయిశ్చరైజర్ చర్మానికి రాసిన 60 సెకండ్లలో ఇంకిపోతుంది. ఆ తర్వాత ఫౌండేషన్‌ను వాడవచ్చు. మొటిమలను గిల్లడం, లోపలి పస్(చీము) తీయడం వంటివి చేస్తే ఆ ప్రాంతంలో మచ్చలు పడే అవకాశం ఉంది. Right: జిడ్డు చర్మం గలవారికి మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరు రోజులో 2-3 సార్లు ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకోవడం, నిమ్మ గుణాలున్న పేస్ప్యాక్లు వేసుకోవడం వల్ల ముఖం శుభ్రంగా ఉండి మొటిమల సమస్య తగ్గుతుంది. Wrong: చాలామంది దుస్తులు ధరించిన తర్వాత పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటారు. దుస్తుల మీద స్ప్రే చేయడం వల్ల అందులోని ఫైబర్ లక్షణాలతో కలిసి పెర్ఫ్యూమ్ సువాసన మారే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ తరహా ప్రయోగాలు చర్మానికి హాని కలిగించవచ్చు. Right: వస్త్రధారణకు ముందు దూది ఉండకు స్ప్రే చేసి గొంతు, ముంజేతులు, భుజాల కింద... పెర్ఫ్యూమ్ను అద్దాలి. దీని వల్ల చర్మానికి హాని కలగదు.


