ఇల్లు ఆస్తి కాదు.. అప్పుల కుప్ప: కియోసాకి | Robert Kiyosaki House Not Asset 3-Piggy-Bank Wealth Rule | Sakshi
Sakshi News home page

ఇల్లు ఆస్తి కాదు.. అప్పుల కుప్ప: కియోసాకి

Sep 17 2026 1:40 PM | Updated on Sep 17 2026 3:03 PM

Robert Kiyosaki House Not Asset 3-Piggy-Bank Wealth Rule

ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణ ప్రజలు ఆస్తులుగా భావించే ఇల్లు, కార్లు అసలు ఆస్తులే కాదని, అవి జేబుల్లోంచి డబ్బులను గుంజే అప్పుల కుప్పలని ఆయన స్పష్టం చేశారు.

"మీరు ఉండే ఇల్లు ఆస్తి కాదు అని 1997లోనే నేను రాశాను. ఆ సమయంలో నా మాటలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పదేళ్లపాటు నన్ను తీవ్రంగా విమర్శిస్తూ మెయిల్స్ పంపారు. కానీ 2008 ఆర్థిక మాంద్యం దెబ్బకు లక్షల మంది సర్వస్వం కోల్పోయాక నా మాటల్లోని నిజం ప్రపంచానికి అర్థమైంది"

"మీ జేబులోకి డబ్బు తెచ్చిపెట్టేది 'ఆస్తి' (Asset). అదే మీ జేబులోంచి డబ్బును బయటకు తీసేది 'అప్పు' (Liability). ఇదే అసలైన సూత్రం. ఈ లెక్కన మీరుండే ఇల్లు, పూర్తిగా ఈఎంఐలు చెల్లించిన కారు కూడా అప్పు కిందకే వస్తాయి. ఎందుకంటే అవి మీ జేబు నుంచి నిర్వహణ ఖర్చులను గుంజుతాయి" కియోసాకి రాసుకొచ్చారు.

ప్రతినెలా మీ ఖాతాలోకి నగదు ప్రవాహాన్ని (Cash Flow) తీసుకురానిది ఏదీ నిజమైన సంపద కాదని, అది కేవలం భద్రత అనే భ్రమను మాత్రమే కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం చేస్తూ, ఇల్లు కొనుక్కొని, 45 ఏళ్ల వయస్సులో చేతిలో తగినంత నగదు లేక ఇబ్బంది పడటానికి ఈ తప్పుడు ఆలోచనా విధానమే కారణమన్నారు.

'త్రీ పిగ్గీ బ్యాంక్స్' ఫార్ములా

తాను, తన భార్య కిమ్ కియోసాకి కలిసి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడానికి 'త్రీ పిగ్గీ బ్యాంక్స్' (Three Piggy Banks) అనే సూత్రాన్ని పాటించామని ఆయన వెల్లడించారు. వచ్చిన ప్రతి రూపాయిలోంచి బిల్లులు చెల్లించడానికి ముందే 10 శాతం పొదుపునకు (Savings), 10 శాతం పెట్టుబడికి (Investing), మరో 10 శాతం విరాళాలకు (Charity) కేటాయించేవాళ్లమని తెలిపారు.

ఆ 10 శాతంతో పెట్టిన పెట్టుబడులే తమకు అసలైన ఆస్తులను తెచ్చిపెట్టాయని, ఆ ఆస్తుల ద్వారా వచ్చే రాబడితోనే తాము ఖర్చులు (Liabilities) వెచ్చించేవారమని చెప్పారు. జీతం డబ్బులతో ఖర్చులు పెట్టడానికి, ఆస్తులు తెచ్చిపెట్టే రాబడితో ఖర్చులు చేయడానికి మధ్య ఉన్న ఈ చిన్న తేడాయే చిన్న వయస్సులోనే రిటైర్మెంట్ సాధించడానికి కారణమవుతుందని కియోసాకి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement