పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి | Hyderabad Man Dies Mysteriously In US He Got Married 17 Days Ago | Sakshi
Sakshi News home page

పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి

Sep 17 2026 12:53 PM | Updated on Sep 17 2026 4:46 PM

Hyderabad Man Dies Mysteriously In US He Got Married 17 Days Ago

అమెరికాలో  హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి  ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.   అమెరికాలోని మసాచుసెట్స్‌లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నమహ్మద్ జాబర్ హుస్సేన్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివాహం జరిగిన కేవల 17 రోజులకే అమెరికాలోని తన ఇంట్లో  శవమై తేలడం  కలకలం  రేపింది.

మసాచుసెట్స్‌లోని లోవెల్‌లో ఉన్న తన ఇంట్లోని గదిలో  హుస్సేన్  నిద్రలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. జాబర్ హుస్సేన్‌కు ఆగస్టు 28న టెక్సాస్‌లో వివాహం జరిగింది. ఆ తర్వాత మసాచుసెట్స్‌లోని తన నివాసానికి తిరిగి వెళ్లారు. సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన కొద్ది గంటలకే, ఆయన గదిలో విగతజీవుడిగా పడి ఉన్నట్లు రూమ్‌మేట్ ద్వారా సమాచారం అందింది.

తాము ఆర్థికంగా బలహీనవర్గానికి చెందినవారమని, హుస్సేన్ పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు రప్పించే ఏర్పాట్లు చేయాలని కుటుంబం భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది.

ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్‌

మజ్లిస్ బచావో తహ్రీక్ (MBT) జోక్యం
ఎంబీటీ ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ దృష్టికి తీసుకువెళ్తూ.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని ఎక్స్ వేదికగా కోరారు. మృతికి అసలు కారణాలు ఏంటి దానిపై స్పష్టత లేదు. పోస్ట్‌మార్టం,వైద్య నివేదికల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement