ఆస్తి తీసుకున్నారు.. అమ్మను గెంటేశారు | 68 years old woman Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

ఆస్తి తీసుకున్నారు.. అమ్మను గెంటేశారు

Sep 17 2026 12:04 PM | Updated on Sep 17 2026 12:04 PM

68 years old woman Incident In Hyderabad

హైదరాబాద్‌: నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లికి చివరి దశలో అండగా నిలవాల్సింది పోయి ఆస్తి కోసం ఆమెను వేధించి ఇంటి నుంచి బయటకు పంపించారని ఆరోపిస్తూ 68 ఏళ్ల వృద్ధురాలు కన్నీటిపర్యంతమైన ఘటన కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. నాగార్జున నగర్‌ కాలనీకి చెందిన కందడి వెంకటమ్మ ఇప్పటికే భర్త, కుమారుడిని కోల్పోయింది. జీవిత చరమాంకంలో తన ఇద్దరు కుమార్తెలు అండగా ఉంటారని భావించినా ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. 

తనకున్న ఆస్తిని ఇద్దరు కుమార్తెలు తమ పేర్లపై రాయించుకున్న అనంతరం తనపై దాడి చేసి, దుర్భాషలాడి ఇంటి నుంచి బయటకు నెట్టివేశారని వెంకటమ్మ ఆరోపిస్తున్నారు. తనను చూసుకునేవారు కూడా లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన వెంకటమ్మ ఆరుబయట కూర్చొని భోరున విలపిస్తోంది. ఆమె పరిస్థితిని చూసి స్థానికులు చలించిపోయారు. ఘటనపై అధికారులు స్పందించి వృద్ధురాలు వెంకటమ్మకు న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై వెంకటమ్మ బుధవారం పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని, వృద్ధాప్యంలో భద్రత, అండ కలి్పంచాలని వేడుకున్నారు.  

ఇదీ చదవండి: అమ్మో.. అంత అవినీతా..?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement