హైదరాబాద్: ఉచితంగా సినిమాలు చూడాలన్న ఆశ, అతని బ్యాంకులోని నగదును మాయం చేసింది. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ ప్రాంతానికి చెందిన షేక్ మహ్మద్ ఈ నెల 11న ఇన్‌స్ట్రాగామ్ స్క్రోల్ చేస్తుండగా ఉచితంగా సినిమాల అందిస్తామన్న ప్రకటన చూశాడు. ‘గూగుల్ పేటీవీ’ అనే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేశాడు. కొద్ది గంటల్లోనే తన ఐడీబీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ. 29 వేలు బదిలీ అయ్యాయి. దీంతో బా«ధితుడు ఈనెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


