బంగారు గణపతి హల్‌చల్‌ | Gold plated Ganesh idol In Begum Bazaar | Sakshi
Sakshi News home page

బంగారు గణపతి హల్‌చల్‌

Sep 16 2026 12:05 PM | Updated on Sep 16 2026 12:12 PM

Gold plated Ganesh idol In Begum Bazaar

హైదరాబాద్: బేగంబజార్‌ ఫీల్‌ఖానాలో లీచీక రాజ బంగారం వినాయకుడంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి బంగారు వినాయకుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సోమవారం, మంగళవారాల్లో ఫీల్‌ఖానా గణనాథున్ని చూసేందుకు ప్రజలు తరలి రావడంతో జనసంద్రంగా మండప పరిసరాలు మారాయి. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో గోషామహల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ దృష్టికి వెళ్లింది.

 లీచీక రాజ గణేష్‌డు ఒరిజినల్‌ బంగారుది కాదని వివరించారు. విగ్రహం బరువు 48 కిలోల గోల్డ్‌ ఉందని, అమెరికా డైమండ్‌ అని సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతుందని, అదంతా బూటకమేనని వెల్లడించారు. విగ్రహానికి ఆర్టిఫిషియల్‌ బంగారుపూత తరహాలో ఆర్టిఫిషియల్‌ బంగారు కలర్‌ వేశారని తెలిపారు. ఎవరైనా బంగారు విగ్రహం అని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

ఇదీ చదవండి: తొలిపూజ వివాదం పూజారి ప్రాణం తీసింది


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement