హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంత్రి కాస్మోస్ భవనంలోకి కొందరు చొరబడి గేట్లు ధ్వంసం చేశారు. ఈ నెల 13న మురళీధర్ రెడ్డి, గడ్డం రవి అనుచరులతో వచ్చి గేట్లు పగులగొట్టి భద్రతా సిబ్బందిపై దాడి చేశారని మేనేజర్ రవి పెద్ది రాజు ఫిర్యాదు చేశారు. హీరో అల్లు అర్జున్ మామ కె.చంద్రశేఖర్ రెడ్డి ప్రోద్బలంతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులు మురళీధర్ రెడ్డి, గడ్డం రవిలపై కేసు నమోదు చేశామని, చంద్రశేఖర్‌రెడ్డి ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: నేను త్రిష స్థానంలో ఉంటే అలా చేసేదాన్ని కాదు : సీనియర్ నటి అంబిక


