సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కేసీఆర్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలన్న సీఎం రేవంత్.. విచారణలో ప్రభుత్వ భూమి అని తేలితే దళితులకు పంచుతామన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో 340 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రేవంత్ పేర్కొన్నారు.
‘‘కల్వకుంట్ల కుటుంబానికి 440 ఎకరాల భూమి ఉంది. ఉద్యమాన్ని, ధరణిని అడ్డుపెట్టుకుని భూ దోపిడీ చేశారు. పాంహౌస్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతా. 27 ఎకరాల ఉండాల్సిన కేసీఆర్ దంపతులకు 67 ఎకరాల భూమి ఉంది. హిమాన్షు పేరు మీద 44.6 ఎకరాల భూమి ఉంది.
..రామలింగరాజు కంపెనీల నుంచి కల్వకుంట్ల వారికి భూములు బదిలీ అయ్యాయి. ఫిరంగి కాల్వ భూములు ఎలా పొందారో కూడా చెబుతా. దాదాపు 700 ఎకరాలు ఫాంహౌస్ పరిధిలో ఉంది. 30 రోజుల్లో ఫాంహౌస్ భూములు స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం’’ అని రేవంత్ తెలిపారు.
‘‘కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల భూ దోపిడీ చేసింది. కేసీఆర్ భూ దోపిడీపై విచారణ జరగాల్సిందే. విచారణకు సిట్‌కు అప్పగిస్తున్నాం. ఇప్పటివరకు పార్ట్-1 మాత్రమే చెప్పా. బడ్జెట్ సెషన్‌లో పార్ట్-2 ఉంది’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ‘ఐపీఎస్’ కోల్డ్‌వార్.. రేవంత్‌కు సంచలన నివేదిక


