హైదరాబాద్: తమ హయాంలో భూముల రిజిస్ట్రేషన్లు ఆగాయని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు సవాల్ విసిరారు. తనతో చర్చకు మంత్రి పొంగులేటి వస్తారా?, లేక సీఎం రేవంతే వస్తారో? తేల్చుకోవాలని చాలెంజ్ చేశారు. తాము ప్రభుత్వం అవినీతి మీద ప్రశ్సిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు హరీష్‌రావు.
ఈరోజు(బుదవారం, సెప్టెంబర్ 16వ తేదీ) తెలంగాణ భవన్ నుంచి మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు.. ఎన్నికల అఫడవిట్‌లో చూపించనవే సభలో రేవంత్‌రెడ్డి చెప్పారని హరీష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీఆర్‌ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్లు ఆగాయంటే తన ముక్కును నేలకు రాస్తానన్నారు. భూభారతిలో 9, 200 మంది భూములు మరొకరికి మారాయని ఆరోపించారు హరీష్, భూభారతి స్కామ్ మీద సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు జరిపించరు? అని ప్రశ్నించిన హరీష్,, భూభారతి కాదు.. భూహారితి అంటూ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం


