సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. తీర్పును శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కాగా బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. కాంగ్రెస్‌లో చేరారని ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ అంశంపై విచారణ చేపట్టిన స్పీకర్ (ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో).. చట్టపరంగా ఆయన పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.


