సీఎం కోటాలో నిన్ను ఐఏఎస్‌ను చేస్తా! | SP Leaders IAS Offer to Bank Employee Goes Viral | Sakshi
Sakshi News home page

సీఎం కోటాలో నిన్ను ఐఏఎస్‌ను చేస్తా!

Sep 16 2026 12:16 PM | Updated on Sep 16 2026 12:47 PM

SP Leaders IAS Offer to Bank Employee Goes Viral

‘‘మీరు చాలా అందంగా ఉంటారు. అంతకంటే మంచి మనసు కూడా ఉంది. మీ వ్యక్తిత్వమూ ఎంతో అద్భుతమైంది. ఇవన్నీ కాదండీ.. మీరు ఓ కంప్లీట్‌ ఉమెన్‌. మీరు చేసే పని మీకు అస్సలు సూట్‌ కాలేదు. నేను గనుక రాజకీయాల్లో కొనసాగితే.. రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కోటాలో మీకు ఏఐఎస్‌ జాబ్‌ ఇప్పిస్తా’’ .. ఇలా ఓ వాట్సాప్‌ మెసేజ్‌ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

బ్యాంక్‌ ఉద్యోగి అయిన ఆమెను ఏకంగా ఐఏఎస్‌ను చేస్తానంటూ బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నాడా  నేత. కాకపోతే అధికారంలోకి వస్తేనే ఆ పని చేస్తాడంట. అందుకోసం ఆమెను ‘కాంప్రమైజ్‌’ కావాలంటూ వేధించాడాయన!. ఓ బ్యాంక్‌ ఉద్యోగిని సంచలన ఆరోపణలతో ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో కలకలం రేగింది. సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ విభాగం కార్యదర్శి రాజన్‌ రిజ్వీ తనను వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిందామె. అంతేకాదు.. తనకు పంపిన పలు మెసేజ్‌లను మీడియా ముందు రిలీజ్‌ చేయడం తీవ్ర దుమారం రేపింది. 

రోజూ నా వెంటపడే వాడు. ఏదో ఒక పని మీద రిజ్వీ రోజూ బ్యాంక్‌కు వచ్చేవాడని.. తోటి సిబ్బందిని ప్రలోభపెట్టి తన నెంబర్‌ సంపాదించాడని.. అప్పటి నుంచి వేధించడం మొదలుపెట్టాడని ఆమె ఆంటోంది. గట్టిగా నిలదీస్తే బెదిరింపులకు దిగాడని ఆరోపిస్తోంది. అంతేకాకుండా.. ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తనకు సీఎం కోటాలో ఐఏఎస్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రిజ్వీ ఆశ చూపుతున్నాడని చెబుతోంది. ఈ మేరకు రిజ్వీ చేసినట్లుగా ఉన్న వాట్సాప్‌ మెసేజ్‌లను బయటపెట్టిందామె.

వేధింపులు ఎక్కువయ్యేసరికి తాను ఫోన్‌ ఎత్తడం మానేశానని.. దీంతో సరాసరి బ్యాంక్‌కు వచ్చి అందరి ముందే బెదిరించాడని చెప్పిందామె. అంతేకాదు.. తన కుటుంబాన్ని సైతం టార్గెట్‌ చేసుకున్నాడని.. గూండాలతో వాళ్లపై నిరంతరం నిఘా పెడుతున్నాడని వాపోయింది. భరించలేకనే ఇలా పోలీసుల ముందుకు రావాల్సి వచ్చిందని తెలిపింది. ఈ నేపథ్యంతో మధురలోని కొత్వాలి పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేయగా.. సెప్టెంబర్‌ 15న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఎస్పీ చర్యలు..
రిజ్వీ వ్యవహారాన్ని ఆధారంగా చేసుకుని అధికార బీజేపీ ప్రతిపక్ష ఎస్పీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అయితే కేసు నమోదైన నేపథ్యంలో రాజన్‌ రిజ్వీని సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి: ఇలా కలిశారో లేదో.. అలా పని జరిగిపోయింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement