తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. నదియాలోని తెహట్టా పోలీస్ స్టేషన్ వద్ద ఒక సమావేశానికి హాజరైన ఆమెను బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు దారుణంగా అవమానించారు. నల్ల జెండాలతో ఆమెను చుట్టుముట్టి, ' గో బ్యాక్' అని నినాదాలతో హోరెత్తించారు. దీంతో హౌలియా పార్క్ కూడలి వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఈ సందర్బంగా మహువా అక్కడి నుండి వెళ్ళిపోతుండగా బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మహువాపై కోటిగుడ్లతో దాడిచేశారు. పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నారు. ఈ దాడిపై మహువా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసుల అనుమతితో తన నియోజకవర్గానికి సమావేశానికి వచ్చిన తనను అడ్డుకున్నారని విమర్శించారు. పోలీసుల సమక్షంలో BJP కార్యకర్తలు తనపై కోడిగుడ్లు విసిరారని మండిపడ్డారు.
అంతేకాదు మీ సలహా ప్రకారం, ఒక స్వాతంత్ర్య సమరయోధుడు తూటాలను ఎదుర్కొన్నట్లే నేను వారిని ఎదుర్కొన్నాను అంటూ కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టున్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తానుద్దేశించి ట్వీట్ చేశారు. ఒక వీడియోను పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!
Big shout out to Hon’ble Justice Dipankar Datta ! MiLord - I came to my constituency for a mtng informing @WBPolice & BJP workers with their help pelted eggs on me. True to your advice I faced them as a freedom fighter faced bullets. pic.twitter.com/CxO3ApzjPL
— Mahua Moitra (@MahuaMoitra) September 16, 2026
ఇదీ చదవండి: ఒరాకిల్‌ను వదిలేసిన టెకీ : ఏకంగా రూ. 9 కోట్ల వ్యాపారం
కాగా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్, మతపరమైన మనోభావాలు దెబ్బతీశారనే ఆరోపణలపై మహువా మొయిత్రిపై పశ్చిమ బెంగాల్‌లో కేసు నమోదైంది. అయితే వ్యక్తిగతంగా హాజరైతే తన భద్రతకు ముప్పు అని,ఈ గుడ్లతో దాడి చేసే అవకాశం ఉందంటూ వర్చువల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు తూటాలను ఎదుర్కొన్నారు, మీరేమో గుడ్లకే భయపడుతున్నారా? అని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. అంతేకాదు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది కూడా.
ఇదీ చదవండి: రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే


