సాక్షి, హైదరాబాద్: సభ ప్రారంభమైన రోజే బీఆర్‌ఎస్ వికృత చేష్టలకు పాల్పడిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో 22ఏ అంశంపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. 22ఏపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. 22ఏ చర్చించాలని ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకుందన్నారు. ఆదర్శంగా ఉండాల్సి కొందరు ప్రజాప్రతినిధులు వికృత చేష్టలకు పాల్పడ్డారంటూ సీఎం మండిపడ్డారు.
‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ సభ జరగకూడదనే ఇలా వ్యవహరించారు. రాష్ట్రంలో సమస్యలు రావాలని పక్క రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారు. గత తప్పిదాలపై సభలో చర్చ జరుగుతుందని బీఆర్‌ఎస్ తెలుసు. రైతులకు, పేదలకూ మా ప్రభుత్వం అన్యాయం చేయదు. అసెంబ్లీ నిర్వహణలో గత ప్రభుత్వ రూల్స్‌నే మేం పాటిస్తున్నాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
‘‘సీఎం రేవంత్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ సభ్యులు సభలో వ్యవహరించారు కాబట్టే సస్పెన్షన్‌కు గురయ్యారు. 22ఏ వారసత్వంగా వచ్చిన సమస్య. 22ఏ ద్వారా కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు భూ దోపిడీ కి పాల్పడ్డాయి. బహిష్కరణకు సంబంధించిన కార్యాచరణ తీసుకోవాలంటే చరిత్రను అర్థం చేసుకోవాలి. చరిత్రను అవగాహన చేసుకుని అందులో నుంచి పాఠాలు నేర్చుకోవాలి. గతంలో జరిగిన తప్పిదాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి. గత అనుభవాల ఆధారంగా భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రస్తుతంలో జరుగుతున్న తప్పిదాలపై సభలో చర్చ జరగాలి
..సభలో జరిగే చర్చలు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తాయి. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు అన్యాక్రాంతం చేసిన అంశంపై సభలో చర్చ జరగాలి. ప్రభుత్వ భూములను పరిరక్షించే అంశాన్ని సభలో ప్రస్తావించకుండా ఉండలేం. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై చర్చ జరగకూడదనుకోవడం సరికాదు. విద్యార్థులకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభలో చర్చ జరగాలి. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చర్చించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై కూడా సభలో చర్చ జరగాలి
..గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా ప్రభుత్వానికి వచ్చిన అంశాలను కూడా సభలో చర్చించాలి. ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యలపై కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ కొంతమంది ప్రజాప్రతినిధులు రాష్ట్రాలు తిరిగి ఆందోళనలు చేసిన అంశాలు కూడా సభలో చర్చకు వస్తాయి. ప్రజా సమస్యలపై గతంలో ప్రజాప్రతినిధులు చేసిన కార్యక్రమాలను కూడా సభలో ప్రస్తావించాల్సి ఉంటుంది. అలాంటి అంశాలు సభలో చర్చకు వస్తాయని తెలిసి సభ ప్రారంభం రోజే అనాగరికమైన ఆలోచనతో వ్యవహరించడం సరికాదు
..సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. మహిళలను అవమానించే విధంగా ఎవరైనా వ్యవహరించినా ప్రభుత్వం సహించదు. మహిళలను అవమానించడం అనాగరికమైన చర్య. పోలీస్ శాఖలో కింది స్థాయి సిబ్బంది అయినా, ఉన్నతాధికారి అయినా చట్టం ముందు సమానమే.
..ప్రజాప్రతినిధి అయినా, సాధారణ వ్యక్తి అయినా చట్టం ముందు సమానమే. ఎవరూ చట్టానికి అతీతులు కాదు. మా ప్రభుత్వానికి ప్రతి మహిళ సమానమే. ప్రతి మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత. మహిళల గౌరవం, ఆత్మగౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మహిళలను అవమానించే చర్యలకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వదు’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘ఐపీఎస్’ కోల్డ్‌వార్.. రేవంత్‌కు సంచలన నివేదిక


