పెన్సిల్వేనియాలో డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం | YSR Foundation Mega Blood Donation Camp in Philadelphia USA | Sakshi
Sakshi News home page

పెన్సిల్వేనియాలో డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం

Sep 17 2026 12:45 PM | Updated on Sep 17 2026 1:19 PM

YSR Foundation Mega Blood Donation Camp in Philadelphia USA

డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (అమెరికా) ఆధ్వర్యంలో వైఎస్సార్‌ పదిహేడవ వర్ధంతి నేపథ్యంలో 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరుల స్మరణార్థం ఫిలడెల్ఫియాలో సెప్టెంబర్ 12, 2026 న అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో మెగా రక్త దాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి, శివ మేక పాల్గొన్నారు. డాక్టర్ రాఘవ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగే ఈ రక్తదాన శిబిరానికి దాదాపు 300 మంది దాక  కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్‌కి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది దాక  రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ పోలంరెడ్డి, శ్రీకాంత్ పెనుమాడ, ఎల్లంపల్లి రామమోహన్ రెడ్డి, నగేష్ ముక్కమల్ల, ఆనంద్ తొండపు, ప్రసాద్ సానికొమ్ము, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, భాస్కర రెడ్డి, ఉయ్యూరు నాగి రెడ్డి, రవి మరక, కొత్త రమణ, కొండా లక్ష్మీనరసింహ రెడ్డి, గీత దోర్నాదుల, ఆళ్ళ అనుపమ రెడ్డి, తాతా రావు, వైఎస్సార్‌ అభిమానులు పాల్గొన్నారు.

యువ వాలంటీర్స్ అనేక మంది ఈ రక్తదాన శిబిరానికి సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీకాంత్ పెనుమాడ, లక్ష్మీనారాయణ రెడ్డి గోపిరెడ్డి, హరి కురుకుండ, వెంకటరామి రెడ్డి శనివరపు మరియు ఇతరులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటుంది డాక్టర్ వైఎస్సార్‌ ఫౌండేషన్!

మంచి భోజనం ఏర్పాటు చేసిన పెప్పర్ హౌస్ రాజేంద్ర మోదుగుల వారికి, సాక్షి టీవీ శివ్ వొడపల్లి గారికి కృతజ్ఞతలు. క్రమం తప్పకుండా ఇలాంటి మెగా రక్త దాన శిబిరాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ఫౌండేషన్ నిర్వహిస్తున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ ప్రత్యేకంగా అభినందించింది.

ఇదీ చదవండి: వైఎస్సార్ చెస్ టోర్న‌మెంట్‌లో విజేతగా శిబి శ్రీనివాస్ చెమిక‌ల‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement