అమెరికాలోని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) పెంచింది. తాజా పెంపుతో వడ్డీ రేటు 3.75 శాతం నుంచి 4 శాతానికి పెరిగినట్లయింది. మూడేళ్ల కాలంలో ఫెడ్ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. ద్రవ్యోల్బణం టార్గెట్ 2 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం.


