62 రోజులుగా మిస్సింగ్‌ : భారత సంతతి మహిళ విషాదాంతం | Indian Origin Woman Found Dead in California Canal Missing for 62 Days | Sakshi
Sakshi News home page

62 రోజులుగా మిస్సింగ్‌ : భారత సంతతి మహిళ విషాదాంతం

Oct 31 2026 1:12 PM | Updated on Oct 31 2026 1:19 PM

Indian Origin Woman Found Dead in California Canal Missing for 62 Days

కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన భారత సంతత మహిళ అనుమానాస్పద స్థితిలో శవమైన ఘటన విషాదాన్ని నింపింది. ఆగస్టు నుంచి కనిపంచకుండా పోయిన 72 ఏళ్ల భారత సంతతి వృద్ధురాలు అజిత్ కౌర్  మృతేదేహాన్ని ఒక కాలువలో అధికారులు గుర్తించారు. అజిత్ కౌర్ అనే మహిళ మృతదేహాన్ని అక్టోబర్ 24, శనివారం కనుగొన్నట్లు సెరెస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (CPD) తెలిపింది.

పోలీసుల సమాచారం ప్రకారం సీరెస్ (Ceres) నగరం పరిధిలోని కాసా గ్రాండే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నుంచి అజిత్ కౌర్ ఆగస్టు 23న అదృశ్యమయ్యారు. ఆ రోజు రాత్రి 1:45 గంటల ప్రాంతంలో విట్మోర్ అవెన్యూ, మిట్చెల్ రోడ్ సమీపంలో ఆమె చివరిసారిగా కనిపంచినట్లు పోలీసులు తెలిపారు. టర్లాక్ ఇరిగేషన్ డిస్ట్రిక్ట్ (TID) ఉద్యోగి ఒకరు తన రోజువారీ తనిఖీల్లో భాగంగా కాలువ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా, సెంట్రల్ అవెన్యూ - కీస్ రోడ్ సమీపంలోని 'లోయర్ లాటరల్ 3' కాలువలో మృతదేహం తేలియాడుతూ  ఉండగా గుర్తించారని పోలీసులు తెలిపారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, అది మానవ మృతదేహమేనని నిర్ధారించారు. అనంతరం, మృతదేహాన్ని స్టానిస్లాస్ కౌంటీ కరోనర్ కార్యాలయానికి (SCCO) తరలించగా, అక్టోబర్ 27న అది అజిత్ కౌర్‌దేనని గుర్తించారు.

ఇదీ చదవండి: 5 స్టార్‌ హోటల్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో షాక్‌ : ఇద్దరు విదేశీయులు దుర్మరణం

పోలీసుల దర్యాప్తు
అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ తూర్పు వైపు ఉన్న TID కాలువలోకి అజిత్ కౌర్ ప్రమాదవశాత్తు పడిపోయి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానించారు. డాగ్ స్క్వాడ్‌ సహా  పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పరిసరాలతో పాటు కాలువ ప్రాంతాలన్నింటినీ జల్లెడ పట్టారు. స్టానిస్లాస్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ డైవ్ యూనిట్ సాయంతో నీటి అడుగున పనిచేసే సోనార్ డ్రోన్‌లను ఉపయోగించి కాలువల్లో వెతికారు. నీటి ప్రవాహ మార్గాలను అంచనా వేసేందుకు TID అధికారులతో కలిసి మ్యాపింగ్ కూడా చేశారు.

మరోవైపు ఈ బాధాకరమైన సమయంలో అజిత్ కౌర్ కుటుంబ సభ్యులకు, బంధువులకు సీరెస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తమ సానుభూతిని ప్రకటించింది. అలాగే దర్యాప్తులో సహకరించిన ఇతర భద్రతా విభాగాలకు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. 

ఇదీ చదవండి: పూజకు పూలు కోస్తూ బాల్కనీ నుంచి పడి తండ్రీ కొడుకులు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement