ఇకపై న్యూయార్క్‌లో.. క్యాన్సిల్‌ సులభం | New York Click To Cancel Subscription Rule | Sakshi
Sakshi News home page

ఇకపై న్యూయార్క్‌లో.. క్యాన్సిల్‌ సులభం

Oct 31 2026 12:08 PM | Updated on Oct 31 2026 12:13 PM

New York Click To Cancel Subscription Rule

న్యూయార్క్‌లో ఇకపై ‘క్లిక్‌ టు క్యాన్సిల్‌’

వినియోగదారుల హక్కులకు చరిత్రాత్మక విజయం

ఇంటర్నెట్‌లో ఏదైనా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడం ఎంత సులభమో, దాన్ని రద్దు చేయడం మాత్రం చాలాకష్టం. ఆ ప్రక్రియ ఎంతకీ పూర్తి కాదు. సైన్‌ అప్‌ కావడానికి కేవలం ఒక్క క్లిక్‌ సరిపోతుంది. సబ్‌స్క్రిప్షన్‌ రద్దు విషయానికి వచ్చేసరికి ఆయా వ్యాపార సంస్థలు కస్టమర్లను ముప్పుతిప్పలు పెడుతుంటాయి. కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేయాలంటే గంటల తరబడి ఫోన్‌ కాల్స్‌లో వేచి ఉండాలి. ఆన్‌లైన్‌లో ‘క్యాన్సిల్‌’బటన్‌ ఎక్కడా కనిపించదు. తప్పుదారి పట్టించే నిబంధనలతో కంపెనీలు వినియోగదారులను మోసం చేస్తుంటాయి. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి న్యూయార్క్‌ నగర యంత్రాంగం ‘క్లిక్‌ టు క్యాన్సిల్‌’సౌకర్యాన్ని తీసుకువచ్చింది.

‘క్లిక్‌ టు క్యాన్సిల్‌’ నిబంధన ఏమిటి?
న్యూయార్క్‌ సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కన్సూ్యమర్‌ అండ్‌ వర్కర్‌ ప్రొటెక్షన్‌ ఈ నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధన ప్రకారం కంపెనీలు తాము అందించే సర్వీసులు, ఆటోమేటిక్‌ రెన్యూవల్‌ సబ్‌స్క్రిప్షన్‌ల రద్దు ప్రక్రియను అత్యంత సరళంగా ఉంచాలి. ఎంత సులభంగా సైన్‌–అప్‌ చేశారో, అంతే సులువుగా క్యాన్సిల్‌ చేయగలగాలి. వినియోగదారులు ఆన్‌లైన్‌లో లేదా యాప్‌ ద్వారా ఒకే క్లిక్‌తో సబ్ర్‌స్కిప్షన్‌ తీసుకుంటే, దాన్ని రద్దు చేయడానికి కూడా కంపెనీలు అదే మార్గాన్ని అందుబాటులో ఉంచాలి.

  • నిబంధనలలో స్పష్టత తప్పనిసరి. అంటే సబ్‌స్క్రిప్షన్‌ విధివిధానాలు, చార్జీలు, రెన్యూవల్‌ తేదీలు వంటి వివరాలను ముందే స్పష్టంగా తెలపాలి.

  • అడ్డంకులు సృష్టించకూడదు. కస్టమర్లు సబ్ర్‌స్కిప్షన్‌ రద్దు చేసుకోలేని విధంగా కావాలనే గందరగోళానికి గురి చేయడం, ఫోన్‌ కట్‌ చేయడం, రద్దు ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం వంటి మోసపూరిత పద్ధతులకు పాల్పడడానికి ఇకపై వీల్లేదు.

ఆర్థిక పరిరక్షణే ప్రధాన ఉద్దేశం!

  • చాలా సందర్భాల్లో కస్టమర్లు తాము వాడని సర్వీసులకు కూడా ఆటోమేటిక్‌ రెన్యూవల్‌ పేరుతో ప్రతినెలా డబ్బులు కోల్పోతుంటారు. ఈ క్లిక్‌ టు క్యాన్సిల్‌ నిబంధన వల్ల అనవసరమైన ఖర్చులకు చెక్‌ 
    పెట్టవచ్చు.

  • క్యాన్సిలేషన్‌ ప్రాసెస్‌ పేరిట కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌లతో వాదనలు చేయడం, అనవసరమైన సర్వేలకు సమాధానాలు చెప్పడం వంటి ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది.

  • ఈ నిబంధనను ఉల్లంఘించే వ్యాపార సంస్థలపై సివిల్‌ పెనాల్టీలు ఉంటాయి. అంతేకాక, వినియోగదారులకు నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నిబంధన అమలు ద్వారా వ్యాపారాల్లో పారదర్శకత పెరుగుతుంది. కస్టమర్లను బలవంతంగా తమ సబ్ర్‌స్కిప్షన్‌లో ఉంచుకునే పద్ధతులు పోయి, నిజమైన సేవల ద్వారా మాత్రమే వినియోగదారులను నిలుపుకునే ఆరోగ్యకరమైన పోటీ మార్కెట్‌కు ఇది పునాది వేస్తుంది. డిజిటల్‌ యుగంలో సబ్‌స్క్రిప్షన్‌ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో న్యూయార్క్‌ నగరం తీసుకువచి్చన ఈ ‘క్లిక్‌ టు క్యాన్సిల్‌’రూల్‌ను వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు. కస్టమర్ల కష్టార్జితాన్ని కాపాడడంలో ఆదర్శవంతమైన ప్రమాణంగా మారుతోంది.

ఇదీ చదవండి: జీ 20 సమావేశంలో భగ్గుమన్న విభేదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement