breaking news
Subscription
-
రెంట్‌కు రోబోట్లు!
నేటి ఆధునిక యుగంలో సాంకేతికత ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన రోబోలు.. నేడు మన నిజజీవితంలో భాగమవుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో రోబోలను భారీ ఖర్చుతో కొనుగోలు చేసే పద్ధతి మారి వాటిని అద్దెకు తీసుకునే ‘రోబోటిక్స్-యాజ్-ఎ-సర్వీస్’ (రాస్) విధానం వేగంగా పుంజుకుంటోంది. ఆసుపత్రులు, హోటళ్లు, ఫ్యాక్టరీల నుంచి గృహ అవసరాల వరకు రోబోట్లు ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ప్రాతిపదికన అందుబాటులోకి వస్తున్నాయి.ఆసుపత్రుల్లో 'మోక్సీ' సేవలుఅమెరికాలోని పలు ఆసుపత్రుల్లో ‘డిలిజెంట్ రోబోటిక్స్’ సంస్థ తయారు చేసిన మోక్సీ అనే రోబోట్ వైద్య సిబ్బందికి ఎంతో సహాయపడుతోంది. నాలుగు అడుగుల ఎత్తు, గుండె ఆకారపు ఎల్ఈడీ కళ్లతో ఉండే ఈ రోబోట్ ఆసుపత్రుల్లో వైద్య సామాగ్రిని చేరవేస్తుంది. నర్సులతో గుడ్ మార్నింగ్ చెప్పడం, హై-ఫైవ్ ఇవ్వడం వంటి పనులతో ఇది అందరి మనసులు గెలుచుకుంది. ఆసుపత్రులు దీనిని పూర్తిగా డబ్బు వెచ్చించి కొనకుండా అద్దె ప్రాతిపదికన వాడుకుంటున్నాయి. ఈ విధానంలో రోబోట్ నిర్వహణ, సాఫ్ట్వేర్ అప్డేట్లు అన్నీ తయారీ సంస్థే చూసుకుంటుంది. దీనివల్ల ముందస్తు భారీ ఖర్చులు తగ్గడమే కాకుండా ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతను ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ సీఓఓ టాడ్ బ్రూగర్ తెలిపారు.హ్యూమనాయిడ్ రోబోలుమనుషులలా కనిపించే హ్యూమనాయిడ్ రోబోలను ప్రస్తుతం వివాహాలు, కార్పొరేట్ ఈవెంట్లలో నృత్యం చేయడం, పాటలు పాడటం, వడ్డించడం వంటి స్పష్టమైన పనుల కోసం అద్దెకు ఇస్తున్నారు. ఒక నిజమైన డాన్సర్ నృత్యాన్ని వీడియో తీసి, ఆ డేటా ద్వారా వీటికి సులభంగా శిక్షణ ఇవ్వవచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విశ్లేషకుడు ఏతాన్ క్వి పేర్కొన్నారు. మరోవైపు, కాలిఫోర్నియాకు చెందిన ‘1ఎక్స్’ సంస్థ నియో అనే హోమ్ హెల్పర్ రోబోట్‌ను ఈ ఏడాది మార్కెట్లోకి తెస్తోంది. దీనిని 20,000 డాలర్లకు కొనుగోలు చేయవచ్చు లేదా నెలకు 499 డాలర్లు చెల్లించి అద్దెకు తీసుకోవచ్చు.కొనుగోలు కంటే అద్దెకే ప్రాధాన్యత ఎందుకు?రోబోటిక్స్ రంగం రోజురోజుకూ మారుతోంది. ఈ రోజు కొన్న రోబోట్ వచ్చే ఏడాదికి పాతబడిపోయే ప్రమాదం ఉంది. అదే అద్దెకు తీసుకుంటే ఎల్లప్పుడూ సరికొత్త మోడల్‌ను ఎంచుకోవచ్చు. అలాగే, కస్టమర్లకు కోడింగ్ లేదా సాంకేతిక నైపుణ్యం లేకపోయినా, ఏదైనా సమస్య వచ్చినా కంపెనీ సిబ్బందే పరిష్కరిస్తారు. చికాగోకు చెందిన ఫార్మిక్ సంస్థ 250కి పైగా పారిశ్రామిక రోబోట్లను ఫ్లాట్ మంత్లీ పేమెంట్ విధానంలో అద్దెకు ఇస్తూ రోబోలను కొనలేని చిన్న కంపెనీలకు అండగా నిలుస్తోంది.అంతర్జాతీయ మార్కెట్, సవాళ్లుచైనా సంస్థలు భవిష్యత్తు అవసరాల కోసం తమ రోబోలను హోటళ్లు, క్లీనింగ్ సేవల్లో లీజుకు ఇస్తూ రియల్ వరల్డ్ డేటాను సేకరిస్తున్నాయి. షాంఘైకి చెందిన అజిబోట్ సంస్థ తన హ్యూమనాయిడ్ రోబోలను యూకే సహా 17 దేశాలలో అద్దెకు అందుబాటులో ఉంచింది. అయితే, చైనాలో ప్రభుత్వ రాయితీలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి ప్రభుత్వ సంస్థలు అద్దె కంటే నేరుగా కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతున్నాయి.కొన్ని కంపెనీలు ప్రతిష్ట కోసం లేదా సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవడం కోసం రోబోలను కొనుగోలు చేస్తున్నప్పటికీ సామాన్య వినియోగదారులకు, చిన్న పరిశ్రమలకు మాత్రం అద్దె సౌలభ్యమే సరైన విధానంగా మారుతోంది. రోబోలు మరింత అధునాతనంగా మారే కొద్దీ ఈ అద్దె విప్లవం ప్రపంచాన్ని శాసించనుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు -
అవి మాత్రమే పోస్ట్ చేస్తా.. 'సబ్స్క్రిప్షన్'పై తెలుగు హీరోయిన్
కొన్నిరోజుల క్రితం ఇన్‌స్టా 'సబ్స్క్రిప్షన్' వల్ల యాంకర్ విష్ణుప్రియ ఎంతలా విమర్శలు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబ్బులు తీసుకుని అర్థనగ్న ఫొటోలు, వీడియోలని పోస్ట్ చేస్తుందని చెప్పి ఈమెపై పోలీసులకు కొందరు ఫిర్యాదు కూడా చేశారు. హీరోయిన్ అనన్య నాగళ్ల లాంటి వాళ్లు తన సబ్స్క్రిప్షన్ అకౌంట్లో ఎలాంటి కంటెంట్ పెడతారనేది క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా ఈ విషయమై స్పష్టత ఇచ్చేసింది.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి)తన సబ్స్క్రిప్షన్ ఛానెల్‌పై వస్తున్న అపోహలపై క్లారిటీ ఇచ్చిన పాయల్.. ఎలాంటి రొమాంటిక్ కంటెంట్ లేదా హాట్ పిక్స్ ఉండవని స్పష్టం చేసింది. తెర వెనుక తన నిజమైన జీవితం, అన్ఫిల్టర్డ్ మూమెంట్స్‌ని మాత్రమే అభిమానులతో పంచుకుంటానని చెప్పింది. తన వ్యక్తిగత హద్దులను గౌరవిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది.'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్.. తర్వాత వెంకీమామ, ఆర్డీఎక్స్ లవ్, డిస్కో రాజా, జిన్నా, మాయపేటిక, మంగళవారం తదితర మూవీస్ చేసింది. ప్రస్తుతం 'కిరాతక' అనే చిత్రంలో నటిస్తోంది.(ఇదీ చదవండి: ఈ సినిమాకు A సర్టిఫికెట్ కూడా తక్కువే!) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..
ఇన్ స్టాలో సబ్స్క్రిప్షన్ పేరిట యాంకర్ విష్ణుప్రియ, హీరోయిన్ అనన్య నాగళ్ల లాంటి వాళ్లు నెలొచ్చేసరికి ఏకంగా లక్షలు సంపాదిస్తున్నారని, అయితే దీనికోసం హద్దులు దాటేస్తున్నారని వార్తలొచ్చాయి. విష్ణుప్రియపై విజయవాడలో కేసు కూడా పెట్టగా.. అనన్య మాత్రం తన రోజూవారీ జీవితంలో జరిగే వాటిని పోస్ట్ చేయడానికే ఈ సబ్స్క్రిప్షన్ పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే వీళ్లని మించే సబ్స్క్రిప్షన్ స్టోరీ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వృత్తిక పటేల్ అనే ఇన్ స్టా అకౌంటే ఈ చర్చకు కారణం. ఇంతకీ ఈమె ఎవరు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)వృత్తిక పటేల్ అనే అమ్మాయి పెద్ద సెలబ్రిటీ ఏం కాదు. కేవలం లక్ష పద్నాలుగ వేలమంది ఫాలోవర్స్ మాత్రమే ఈమెకు ఉన్నారు. కానీ ఈమెని 300 మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.390 అంటే దాదాపు రూ.లక్ష రూపాయల వరకు నెలకు ఈమె సంపాదిస్తోంది. ఇంతా చెప్పుకొన్నాం కదా అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. ఎందుకంటే మీరూ చూసేదంతా నిజం కాదు అన్నట్లు.. వృత్తిక పటేల్ అనేది అమ్మాయి కాదు. ఇది ఏఐ మాయాజాలంతో సృష్టించిన ఖాతా.అవును మీరు విన్నది నిజమే. వృత్తిక పటేల్ అనే వ్యక్తిని ఏఐలో సృష్టించిన ఓ వ్యక్తి లేదా వ్యక్తులు.. నిజంగా అమ్మాయిలా ఉండేలా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఐపీఎల్, దేవుడు లాంటి రెగ్యులర్ టాపిక్స్‌కి సంబంధించి కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. అలానే సబ్స్క్రిప్షన్ పెడితే 300 మంది వరకు చేరారు. ఈమె నిజమైన అమ్మాయి కాదు ఏఐ అని గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ ఈమె ఫాలోవర్స్ తగ్గడం లాంటివి జరగలేదు.విష్ణుప్రియ, అనన్య నాగళ్ల లాంటి వాళ్లు అమ్మాయిలు కాబట్టి వీళ్లపై కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ వృత్తిక పటేల్ ఖాతా నడుపుతున్న వ్యక్తులు ఎవరో గానీ టెక్నాలజీని ఉపయోగించి ఇన్ స్టాలో నెలకు సులభంగా లక్షకు పైనే సంపాదించేస్తున్నారు. కాబట్టి అబ్బాయిలా జాగ్రత్త!(ఇదీ చదవండి: తెలుగు హీరోల్లో 90 శాతం మంది డూపులతోనే..) View this post on Instagram A post shared by Vrutika Patel (@vrutikaapatel) -
బూతు కాదు నేను పోస్ట్ చేస్తున్నది భక్తి కంటెంట్
రీసెంట్ టైంలో ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌తో యాంకర్ విష్ణుప్రియ లాంటి వాళ్లు లక్షలు సంపాదిస్తున్నారనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. ఇందులో భాగంగా రూ.399 కడితే అర్థ నగ్న వీడియోలు పోస్ట్ చేస్తుందనే ఆరోపణలతో ఈమెపై విజయవాడలో కేసు కూడా పెట్టారు. ఈ ఫిర్యాదు మాటేమో గానీ ఈ వివాదం జరగక ముందు విష్ణుప్రియకు ఉన్న సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఏకంగా మూడు రెట్లు పెరిగారు. ఈమె సంగతి పక్కనబెట్టి తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్లపై పడ్డారు.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)వకీల్‌సాబ్, మల్లేశం తదితర సినిమాల్లో నటించిన తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా ఇన్‌స్టా సబ్స్క్రిప్షన్ పేరిట లక్షల సంపాదించేస్తుందని విష్ణుప్రియని వదిలేసి ఈమెపై పడ్డారు. దీంతో తప్పక ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తను ఈ సబ్‌స్క్రిప్షన్‌ని మొదలుపెట్టింది అంతా ఓ కమ్యూనిటీలా కలిసి ఉండేందుకే అని చెప్పుకొచ్చింది.అలానే తన దినచర్యలో చేసే వాటి గురించి చెప్పేందుకే ఈ సబ్స్క్రిప్షన్ మొదలుపెట్టానని చెబుతూ.. గతేడాది ఏప్రిల్ 7వ తేదీన పోస్ట్ చేసిన వీడియోని ఇప్పుడు షేర్ చేసింది. ఈ వీడియోలో అనన్య.. ఓం నమః శివాయ మంత్రాన్ని 21 రోజులు 108 సార్లు చదివితే మనసు ప్రశాంతంగా మారుతుందని చెబుతూ కనిపించింది.అలా 2025లోనే సబ్స్క్రిప్షన్ గురించి వీడియో చేసి రిలీజ్ చేశానంటూ అనన్య క్లారిటీ ఇచ్చింది. ఇన్‌స్టా సబ్స్క్రిప్షన్ గురించి కొన్ని అనవసరమైన కామెంట్లు చూస్తున్నానని, అందుకే వివరణ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ వీడియో ద్వారా తను సబ్‌స్క్రిప్షన్‌లో గ్లామరస్ ఫొటోలు గానీ, బూతు కంటెంట్ గానీ పోస్ట్ చేయట్లేదని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడైనా ఈమెపై విమర్శలు తగ్గుతాయా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొణె.. రెండోసారి ప్రెగ్నెన్సీ) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla)


