ఇన్ స్టాలో సబ్‌స్క్రిప్షన్ పేరిట యాంకర్ విష్ణుప్రియ, హీరోయిన్ అనన్య నాగళ్ల లాంటి వాళ్లు నెలొచ్చేసరికి ఏకంగా లక్షలు సంపాదిస్తున్నారని, అయితే దీనికోసం హద్దులు దాటేస్తున్నారని వార్తలొచ్చాయి. విష్ణుప్రియపై విజయవాడలో కేసు కూడా పెట్టగా.. అనన్య మాత్రం తన రోజూవారీ జీవితంలో జరిగే వాటిని పోస్ట్ చేయడానికే ఈ సబ్‌స్క్రిప్షన్ పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే వీళ్లని మించే సబ్‌స్క్రిప్షన్ స్టోరీ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వృత్తిక పటేల్ అనే ఇన్ స్టా అకౌంటే ఈ చర్చకు కారణం. ఇంతకీ ఈమె ఎవరు?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)
వృత్తిక పటేల్ అనే అమ్మాయి పెద్ద సెలబ్రిటీ ఏం కాదు. కేవలం లక్ష పద్నాలుగ వేలమంది ఫాలోవర్స్ మాత్రమే ఈమెకు ఉన్నారు. కానీ ఈమెని 300 మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.390 అంటే దాదాపు రూ.లక్ష రూపాయల వరకు నెలకు ఈమె సంపాదిస్తోంది. ఇంతా చెప్పుకొన్నాం కదా అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. ఎందుకంటే మీరూ చూసేదంతా నిజం కాదు అన్నట్లు.. వృత్తిక పటేల్ అనేది అమ్మాయి కాదు. ఇది ఏఐ మాయాజాలంతో సృష్టించిన ఖాతా.
అవును మీరు విన్నది నిజమే. వృత్తిక పటేల్ అనే వ్యక్తిని ఏఐలో సృష్టించిన ఓ వ్యక్తి లేదా వ్యక్తులు.. నిజంగా అమ్మాయిలా ఉండేలా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఐపీఎల్, దేవుడు లాంటి రెగ్యులర్ టాపిక్స్‌కి సంబంధించి కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. అలానే సబ్‌స్క్రిప్షన్ పెడితే 300 మంది వరకు చేరారు. ఈమె నిజమైన అమ్మాయి కాదు ఏఐ అని గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ ఈమె ఫాలోవర్స్ తగ్గడం లాంటివి జరగలేదు.
విష్ణుప్రియ, అనన్య నాగళ్ల లాంటి వాళ్లు అమ్మాయిలు కాబట్టి వీళ్లపై కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ వృత్తిక పటేల్ ఖాతా నడుపుతున్న వ్యక్తులు ఎవరో గానీ టెక్నాలజీని ఉపయోగించి ఇన్ స్టాలో నెలకు సులభంగా లక్షకు పైనే సంపాదించేస్తున్నారు. కాబట్టి అబ్బాయిలా జాగ్రత్త!
(ఇదీ చదవండి: తెలుగు హీరోల్లో 90 శాతం మంది డూపులతోనే..)


