తెలుగు హీరోల్లో 90 శాతం మంది డూపులతోనే.. | Ravi Babu Makes Shocking Claim, Says 90% Telugu Heroes Use Body Doubles For Fight Scenes, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Ravibabu: నాలాంటోడు ఒక్కడూ దొరకలేదు.. అందుకే

Apr 28 2026 1:35 PM | Updated on Apr 28 2026 2:01 PM

Ravi Babu Reveal Telugu Actor Usage Dupes For Action

తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ బడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ‍అయితే వీళ్లలో నిజమైన ఫైట్స్ చేసేది ఎంతమంది అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే చాలామంది డూప్స్ ఉపయోగిస్తుంటారు. కాకపోతే ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతుంటారు. అలానే సీన్స్‌లోనూ సదరు డూప్ ఉన్నాడని తెలియకుండా చూసుకుంటారు. అయితే టాలీవుడ్‌లో 90 శాతం మంది హీరోలు, డూపులనే ఉపయోగిస్తున్నారని చెప్పి నటుడు, దర్శకుడు రవిబాబు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!)

'నా సినిమాలో హీరోది మధ్య వయసు పాత్ర. దీని కోసం టాలీవుడ్‌లో ఎవరుంటారా అని చూస్తే ఒక్కరూ కనిపించలేదు. ఎందుకంటే నాలా ఫిజికల్‌గా బలంగా ఉండి, నాలా నటించి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనుకుంటే ఎవరూ దొరకలేదు. అందుకే నేనే చేశాను. అలానే మన దగ్గర 90 శాతం మంది హీరోలు డూప్స్ ఉపయోగిస్తుంటారు. నేను మాత్రం ఫైట్స్ సీన్స్‌లో మార్షల్ ఆర్ట్స్ లాంటివి, కిక్స్ నిజంగా ఫెర్ఫార్మ్ చేశాను' అన రవిబాబు చెప్పుకొచ్చాడు.

సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రవిబాబు.. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే 'అల్లరి' లాంటి కామెడీ మూవీస్‌తో దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లలో చూసుకుంటే మూవీస్ అయితే తీస్తున్నాడు గానీ వాటిని పట్టించుకునే నాథుడు లేడు. ఇప్పుడు కూడా 'రేజర్' అనే రివేంజ్ యాక్షన్ డ్రామా సినిమా చేశారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా, ఇందులో అంత రక్తపాతమే కనిపించింది. మే 08న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి రవిబాబుకి ఇదెంత వరకు కలిసొస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement