Razor Movie
-
ఒళ్లు బలిసి సినిమాలు చేస్తున్నారు : రవిబాబు
ఒకప్పుడు సినిమా తీసేవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేసేవారని..ఇప్పుడు ఒళ్లు బలిసి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నాడు నటుడు, దర్శకుడు రవిబాబు. చాలా గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వంలో రేజర్ అనే సినిమా రాబోతుంది. ఇందులో ఆయనే హీరోగా నటించాడు. మే 8న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయాడు రవిబాబు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటికీ ఇప్పటికి ఫిలిం మేకింగ్ లో వచ్చిన మార్పులపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.‘అప్పుడు సినిమాలు చేసేవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని తీసేవాళ్లు. ఇప్పుడు సినిమాలు చేసేవాళ్లు ఒళ్లు బలిసి చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో 'ఫిల్మ్'లో సినిమా తీస్తాం కాబట్టి, దానిపై ఒక రెస్పెక్ట్ ఉండేది. ఫిల్మ్ చాలా ఖరీదైనది కావడంతో, యాక్టర్స్ , డైరెక్టర్స్, కెమెరామెన్ అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఎవరి పనులు వాళ్లు చేసేవాళ్లు. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. చిప్ వేస్తున్నాడు, తీస్తున్నాడు.. మళ్లీ అదే చిప్ పెడుతున్నాడు. దాని కాస్ట్ కూడా కాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే బేసిక్ ఇన్ ఫుట్ టెక్నాలజీ మీద, టైమ్ మీద రెస్పెక్ట్ లేకుండా పోయింది. అప్పట్లో టైమ్‌కి,డబ్బులకి వ్యాల్యూ ఇచ్చేవారు. ఇప్పుడు అసలు అదేం లేదు. ఒకప్పుడు ప్రొడక్షన్ ప్లానింగ్ అంతా డిసిప్లైన్ గా జరిగేది. ఇప్పుడు అలాంటి డిసిప్లైన్ లేదు’ అని రవిబాబు అన్నారు. అయితే ‘ఒళ్లు బలిసి సినిమాలు చేస్తున్నారు’ అని విమర్శించడాన్ని కొంతమంది నెటిజన్స్ తప్పుపడుతున్నారు. టెక్నీషియన్లను ఉద్దేశించి ఇలాంటి పదజాలం వాడటం సరికాదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది రవిబాబు వ్యాఖ్యలలో వాస్తవం ఉందని కొందరు సమర్థిస్తున్నారు. -
తెలుగు హీరోల్లో 90 శాతం మంది డూపులతోనే..
తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ బడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే వీళ్లలో నిజమైన ఫైట్స్ చేసేది ఎంతమంది అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే చాలామంది డూప్స్ ఉపయోగిస్తుంటారు. కాకపోతే ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతుంటారు. అలానే సీన్స్‌లోనూ సదరు డూప్ ఉన్నాడని తెలియకుండా చూసుకుంటారు. అయితే టాలీవుడ్లో 90 శాతం మంది హీరోలు, డూపులనే ఉపయోగిస్తున్నారని చెప్పి నటుడు, దర్శకుడు రవిబాబు షాకింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!)'నా సినిమాలో హీరోది మధ్య వయసు పాత్ర. దీని కోసం టాలీవుడ్లో ఎవరుంటారా అని చూస్తే ఒక్కరూ కనిపించలేదు. ఎందుకంటే నాలా ఫిజికల్‌గా బలంగా ఉండి, నాలా నటించి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనుకుంటే ఎవరూ దొరకలేదు. అందుకే నేనే చేశాను. అలానే మన దగ్గర 90 శాతం మంది హీరోలు డూప్స్ ఉపయోగిస్తుంటారు. నేను మాత్రం ఫైట్స్ సీన్స్‌లో మార్షల్ ఆర్ట్స్ లాంటివి, కిక్స్ నిజంగా ఫెర్ఫార్మ్ చేశాను' అన రవిబాబు చెప్పుకొచ్చాడు.సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రవిబాబు.. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే 'అల్లరి' లాంటి కామెడీ మూవీస్‌తో దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లలో చూసుకుంటే మూవీస్ అయితే తీస్తున్నాడు గానీ వాటిని పట్టించుకునే నాథుడు లేడు. ఇప్పుడు కూడా 'రేజర్' అనే రివేంజ్ యాక్షన్ డ్రామా సినిమా చేశారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా, ఇందులో అంత రక్తపాతమే కనిపించింది. మే 08న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి రవిబాబుకి ఇదెంత వరకు కలిసొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా) -
ట్రైలర్: ఈసారి రక్తపాతాన్ని నమ్ముకున్న రవిబాబు
గతంలో నటుడిగా మాత్రమే చేస్తూ ఆకట్టుకున్న రవిబాబు.. ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు తీస్తూ వస్తున్నాడు. కుదిరినప్పుడు వాటిలో తనే లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇకపోతే రవిబాబు తీసిన గత రెండు చిత్రాలు ఓటీటీలో నేరుగా రిలీజ్ కాగా.. దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్లోకి వచ్చే మూవీని సిద్ధం చేశాడు. అదే 'రేజర్'. వచ్చే నెల 8న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.(ఇదీ చదవండి: 'పెద్ది' నటుడి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్)ట్రైలర్ బట్టి చూస్తే ఓ పాపని రక్షించే బాధ్యత రవిబాబు పాత్రది. ఈ క్రమంలోనే పాపని చంపేందుకు వచ్చిన రౌడీలని చంపుకొంటూ వెళ్తుంటాడు. అయితే చంపే క్రమంలో ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు రక్తపాతాన్ని బాగానే చూపించాడు. ఇతడి గత చిత్రాల మాదిరిగానే కలర్ టోన్ మెంటైన్ చేశాడు. ట్రైలర్ అయితే రొటీన్‌గానే అనిపించింది.కొన్నాళ్ల ముందు వరకు అవును, అవును 2 పేరుతో హారర్ సినిమాలు తీసిన రవిబాబు.. తర్వాత క్రైమ్ థ్రిల్లర్స్ తీశాడు. ఇప్పుడు యాక్షన్, రక్తపాతాన్ని నమ్ముకున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర 'రేజర్' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)Ravi Babu’s #Razor trailer is a relentless, edge-of-your-seat ride packed with brutal, nonstop action. A complete bloodbath 🔥 #RazorTheMovie Trailer out now:#RazorOnMay8th#Razor - A Ravi Babu Film.A Flying Frogs ProductionComing to scorch theatres this summer on May 8th.… pic.twitter.com/wEJ3208kQm— BA Raju's Team (@baraju_SuperHit) April 18, 2026


