ట్రైలర్: ఈసారి రక్తపాతాన్ని నమ్ముకున్న రవిబాబు | Ravi Babu Razor Movie Trailer | Sakshi
Sakshi News home page

Razor Trailer: మొన్నటివరకు హారర్.. ఇప్పుడు యాక్షన్

Apr 18 2026 5:49 PM | Updated on Apr 18 2026 6:38 PM

Ravi Babu Razor Movie Trailer

గతంలో నటుడిగా మాత్రమే చేస్తూ ఆకట్టుకున్న రవిబాబు.. ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు తీస్తూ వస్తున్నాడు. కుదిరినప్పుడు వాటిలో తనే లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇకపోతే రవిబాబు తీసిన గత రెండు చిత్రాలు ఓటీటీలో నేరుగా రిలీజ్ కాగా.. దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్‌లోకి వచ్చే మూవీని సిద్ధం చేశాడు. అదే 'రేజర్'. వచ్చే నెల 8న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.

(ఇదీ చదవండి: 'పెద్ది' నటుడి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్)

ట్రైలర్ బట్టి చూస్తే ఓ పాపని రక్షించే బాధ్యత రవిబాబు పాత్రది. ఈ క్రమంలోనే పాపని చంపేందుకు వచ్చిన రౌడీలని చంపుకొంటూ వెళ్తుంటాడు. అయితే చంపే క్రమంలో ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు రక్తపాతాన్ని బాగానే చూపించాడు. ఇతడి గత చిత్రాల మాదిరిగానే కలర్ టోన్ మెంటైన్ చేశాడు. ట్రైలర్ అయితే రొటీన్‌గానే అనిపించింది.

కొన్నాళ్ల ముందు వరకు అవును, అవును 2 పేరుతో హారర్ సినిమాలు తీసిన రవిబాబు.. తర్వాత క్రైమ్ థ్రిల్లర్స్ తీశాడు. ఇప్పుడు యాక్షన్, రక్తపాతాన్ని నమ్ముకున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర 'రేజర్' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement