'పెద్ది' నటుడి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ | Glory Series OTT Trailer And Streaming Update | Sakshi
Sakshi News home page

Glory: బాక్సింగ్ స్టోరీతో సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Apr 18 2026 4:54 PM | Updated on Apr 18 2026 5:09 PM

Glory Series OTT Trailer And Streaming Update

'మీర్జాపుర్' సిరీస్‌తో మున్నాభయ్యాగా ఫేమస్ అయిన దివ్యేందు.. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో నటిస్తున్నాడు. మరోవైపు ఇతడు లీడ్ రోల్ చేసిన స్పోర్ట్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉండేసరికి సిరీస్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)

దివ్యేందు, పులకిత్ సామ్రాట్ ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'గ్లోరీ'. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే క్రైమ్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చే నెల 01వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. 'మీర్జాపుర్' సిరీస్ తీసిన కరణ్ అన్షుమన్ దీని సృష్టికర్త కావడంతో అంచనాలు నెలకొన్నాయి.

'గ్లోరీ' సిరీస్ విషయానికొస్తే.. ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష‍్యంగా బతికే కోచ్ రఘుబీర్ సింగ్ (సువీందర్ విక్కీ). ఇతడి కూతురు గుడియా (జన్నత్ జుబైర్)పై ఓ రోజు దాడి జరుగుతుంది. మరోవైపు వర్ధమాన బాక్సర్ నిహాల్ సింగ్, అనుమానాస్పద రీతిలో చనిపోతాడు. దీంతో తండ్రి రఘుబీర్‌కి చాన్నాళ్ల పాటు దూరంగా ఉన్న కొడుకులు దేవ్(దివ్యేందు), రవి (పులకిత్ సామ్రాట్) తిరిగి సొంతూరు శక్తిఘడ్‌కి వస్తారు. తర్వాత ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement