ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన | Razor Movie 2026 OTT Latest Update | Sakshi
Sakshi News home page

Razor OTT: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఇప్పుడు ఓటీటీలోకి

Jun 15 2026 2:48 PM | Updated on Jun 15 2026 2:58 PM

Razor Movie 2026 OTT Latest Update

తెలుగులో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు గుర్తుండే ఉంటాడు. చాన్నాళ్లుగా తెరపై పెద్దగా కనిపించని ఇతడు.. ట్రెండ్‌కి తగ్గట్లే ఓ యాక్షన్ మూవీ చేశాడు. దర్శకత్వంతో పాటు హీరోగానూ ఇతడే నటించాడు. కాకపోతే థియేటర్లలో రిలీజైన తొలి ఆట నుంచి దారుణమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

(ఇదీ చదవండి: పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్)

సహాయ నటుడిగా అద్భుతమైన పాత్రలు చేసిన రవిబాబు.. 'అల్లరి' మూవీతో దర్శకుడిగా మారాడు. అవును, అనసూయ, అమరావతి లాంటి డిఫరెంట్ ప్రయోగాలు చేశాడు. అప్పట్లో ఇవి ఉన్నంతలో బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ ట్రెండ్‌కి తగ్గట్లు కంటెంట్ మార్చుకోలేక మూవీస్ చేయడం తగ్గించుకుంటూ వచ్చేశాడు. 'రేజర్' పేరుతో తీసిన యాక్షన్ చిత్రాన్ని గత నెల 8న థియేటర్లలో రిలీజ్ చేశాడు. దీని ప్రమోషన్లలో సినిమాల గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. వాటిని అందరూ బాగానే చూశారు గానీ మూవీని ఒక్కడూ పట్టించుకోలేదు.

ఇప్పుడీ చిత్రం ఈ శుక్రవారం(జూన్ 19) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఆడియెన్స్ దీన్ని థియేటర్లలో పట్టించుకోలేదు. మరి ఓటీటీలోనైనా పట్టించుకుంటారేమో చూడాలి? ఇకపోతే ఈ వారం దీనితోపాటు దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3, కెనాతా కానమ్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి.

'రేజర్' విషయానికొస్తే.. రాష్ట్ర హోంమంత్రి (కనకరాజు) తన కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. దీనికి సంబంధించిన  సీసీటీవీ ఫుటేజీ విష్ణు (తనీష్‌) చేతికి చిక్కుతుంది. దీంతో హోంమంత్రి ముఠా విష్ణును, అతని భార్యని చంపేస్తారు. ప్రాణాలతో బయటపడిన విష్ణు కూతురు తేజును.. పెట్‌ గ్రూమింగ్ చేసే రుద్ర ప్రతాప్‌ (రవిబాబు) కాపాడతాడు. తర్వాత హోంమంత్రి గ్యాంగ్‌ నుంచి ఆ చిన్నారిని రవిబాబు ఎలా కాపాడాడనేది మిగిలిన కథ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement