ఓటీటీలు అనగానే దాదాపుగా థ్రిల్లర్ సినిమాలు,సిరీస్‌లే గుర్తొస్తుంటాయి. అందుకు తగ్గట్లే ప్రతివారం తమిళ, మలయాళ భాషల నుంచి ఈ జానర్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఓ క్రేజీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చూచాయిగా చెప్పేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ సినిమా.. తెలుగులోనూ)
ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ సిరీస్ 'వదంది'. 2022లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు దీనికి రెండో సీజన్ కూడా రెడీ చేశారు. ఇందులో శశికుమార్ పోలీస్ అధికారిగా ప్రధాన పాత్ర చేశారు. ఓ మర్డర్ కేసులో జైలుపాలైన మణి అనే కుర్రాడు.. నిజంగా ఈ హత్యలు చేశాడా? ఇంతకీ ఈ మర్డర్స్ వెనకున్న కారణమేంటి? ఎవరు చేశారు? అనేదే స్టోరీ.
'వదంది 2' సిరీస్‌కి ఆండ్రూ లూయిస్ దర్శకుడు కాగా స్టార్ దర్శకద్వయం పుష్కర్-గాయత్రి నిర్మాతలుగా వ్యవహరించారు. వచ్చే శుక్రవారం(ఆగస్టు 07) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. అపర్ణ దాస్, రేవతి శర్మ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ)


