మహేశ్ బాబు కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం నటుడు జయకృష్ణ. రమేశ్ బాబు కొడుకు ఈ కుర్రాడు. హీరోగా చేసిన తొలి సినిమా 'శ్రీనివాస మంగాపురం' నిన్న(జూలై 30) థియేటర్లలోకి వచ్చింది. ఫ్యాన్స్‌లో కొందరికి నచ్చింది మిగతావాళ్లంతా ఈ మూవీ చూసి పెదవి విరిచారు. పాతకాలం కథని పాత స్టైల్లోనే తీశారని అంటున్నారు. మరి ఈ మూవీకి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి? ట్రేడ్ వర్గాలు ఏమంటున్నాయి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా.. 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ)
జయకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాకి ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు. సీనియర్ నటి రవీనా టండన్ కూతరు రషా తడానీ ఇందులో హీరోయిన్‌గా నటించింది. అయితే హీరోగా చేస్తున్న తొలిమూవీ కావడంతో యాక్టింగ్ పరంగా పర్లేదనిపించాడు గానీ ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి తొలిరోజు రూ.1.25 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయని సమాచారం.
కొత్త హీరోకి ఈ వసూళ్లు తక్కువే కావొచ్చు గానీ ప్రస్తుతానికైతే సినిమాకు పాజిటివ్ టాక్ లేదు. ఉన్నంతలో ఘట్టమనేని అభిమానులు ఈ మూవీ చూసి పోస్టులు పెడుతున్నారు. మరి ఇవన్నీ ఈ చిత్రానికి ఏ మేరకు కలిసొస్తాయనేది చూడాలి?
'శ్రీనివాస మంగాపురం' విషయానికొస్తే.. శ్రీను (జయకృష్ణ)తిరుపతికి వస్తాడు. ఈ ఊరిలో ఉండే పెద్దారెడ్డి(కిక్ శ్యామ్) కూతురు మంగ(రషా తడానీ)ని ఇష్టపడతాడు. ఆమె వెంటపడుతూ దగ్గరవుతాడు. చివరకు ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. అయితే మంగకు అప్పటికే నిశ్చితార్థం జరిగినా శ్రీను తన ప్రేమ సంగతి ఈమెకు చెబుతాడు. ఇంతలో మంగ మేనత్త వర (వాసుకి) బళ్లారి నుంచి తిరుపతి వస్తుంది. మంగ ఫోన్‌లో శ్రీను ఫోటోలు చూసిన ఆమె.. మంగకు దూరంగా ఉండమని అతడిని హెచ్చరిస్తుంది. ఇంతకీ శ్రీను గతమేంటి? మంగతో అతడికి ఉన్న సంబంధమేంటి? మంగ కోసం తిరుపతికి రావడానికి కారణమేంటి? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ‘శ్రీనివాస మంగాపురం’మూవీ రివ్యూ అండ్ రేటింగ్)


