ఆ రోజే నా సినిమా కూడా రిలీజైంది: మహేశ్ బాబు స్పెషల్ వీడియో | Mahesh Babu Released a Special Video about Srinivasa Mangapuram movie | Sakshi
Sakshi News home page

Mahesh Babu: ఆ రోజే నా సినిమా రిలీజైంది: ప్రిన్స్ స్పెషల్ వీడియో

Jul 26 2026 1:19 PM | Updated on Jul 26 2026 1:37 PM

Mahesh Babu Released a Special Video about Srinivasa Mangapuram movie

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు సోదరుడు  రమేష్‌బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీలో రవీనా టాండన్‌ కూతురు రషా తడానీ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు అజయ్‌ భూపతి దర్శకత్వం వహిం చారు. అశ్వినీదత్‌ సమర్పణలో పి. కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఈ మూవీపై టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు స్పందించారు. మా రమేశన్న వాళ్ల అబ్బాయి జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది మా కుటుంబానికి చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. ఇప్పటి వరకు చూసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ చాలా చాలా బాగున్నాయని ప్రశంసించారు. ఈ క్రెడిట్ అంతా అజయ్‌ భూపతికి దక్కుతుందన్నారు. ఈ సినిమా జూలై 30న రిలీజ్‌ కానుంది.. అదే రోజు నా సినిమా రాజ కుమారుడు కూడా విడుదలైందని వెల్లడించారు. ఈ మూవీతో మీరంతా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మహేశ్ బాబు ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement