డబ్బులున్న వారా లేదా సంతోషంగా ఉండేవారా? ఎవరు అమీర్‌? | Rana Daggubati Spirit Media To Release Ameer Log Movie | Sakshi
Sakshi News home page

డబ్బులున్న వారా లేదా సంతోషంగా ఉండేవారా? ఎవరు అమీర్‌?

Jul 26 2026 11:22 AM | Updated on Jul 26 2026 11:36 AM

Rana Daggubati Spirit Media To Release Ameer Log Movie

ఎంసీ హరి, మనోజ్, శశిధర్‌ ప్రధాన పాత్రల్లో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమీర్‌ లోగ్‌’. వేద జలంధర్, రావణ్‌ నిట్టూరు, విశ్వేందర్‌ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రానికి మనోహర్‌ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్‌ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్ట్‌ 21న విడుదల చేస్తోంది. శనివారం హైదరాబాద్‌లో ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ‘అవ్వల్‌ దావత్‌...’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ– ‘‘మాది నల్గొండలోని రాఘవపురం. నేను 1997లో హైదరాబాద్‌కు వచ్చాను. హైదరాబాద్‌ మనుషుల్ని తెరపై చూపించాలని ‘అమీర్‌ లోగ్‌’ మూవీ తీశాను. డబ్బులున్న వారు అమీర్‌లోగా? సంతోషంగా ఉండేవారు అమీర్‌ లోగా? ఎవరు అమీర్‌? అన్నది ఈ చిత్రం చూసిన తర్వాత అర్థం అవుతుంది’’ అని చెప్పారు. ‘‘అందరూ మా సినిమా చూసి నటీనటులను, సాంకేతిక నిపుణులను సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మాధవి రెడ్డి. 

‘‘హైదరాబాద్‌ను, ఇక్కడి బస్తీలను రమణా రెడ్డిగారు అద్భుతంగా చూపించారు’’ అని స్మరణ్‌ సాయి చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో మనుషులు ఎలా ఉంటారు? బిర్యానీ ఎలా ఉంటుంది? క్రికెట్‌ అంటే ఎంత ప్యాషన్‌? అని ఎవరైనా అడిగితే ‘అమీర్‌ లోగ్‌’ సినిమా చూపించండి’’ అని వేద, హరి, మనోజ్, శశిధర్, సాయి యోగి, కీర్తి, రచయిత మనోజ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement