హైదరాబాద్: థియేటర్‌లో సినిమా చూస్తున్న ఓ కార్మికుడు గుండెనొప్పితో కన్నుమూశాడు. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన మేరకు.. నిజామాబాద్‌కు చెందిన డొక్కా కృష్ణ (35) కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఉంటూ రోజు కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం మరో స్నేహితుడితో కలిసి అర్జున్ థియేటర్‌లో మార్నింగ్ షో(చెన్నయ్ లవ్ స్టోరీ)కు వెళ్ళాడు.
ఇంటర్‌వెల్ సమయంలో బయటకు వెళ్లి వచ్చిన కృష్ణ కూర్చున్న కుర్చీలోనే పడుకుని ఉన్నాడు. సినిమా అయిపోయినా లేవకపోవడంతో థియేటర్ నిర్వాహకులకు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో రామ్‌దేవ్‌రావ్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


