పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి దుర్మరణం | Young Woman Ends Life In Road Accident | Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి దుర్మరణం

Jul 26 2026 7:37 AM | Updated on Jul 26 2026 7:49 AM

Young Woman Ends Life In Road Accident

హైదరాబాద్‌: త్వరలో పెళ్లి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. వివాహం నిశ్చయమై జీవితాంతం కలిసి ఉండాల్సిన కాబోయే దంపతులు దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది.  హైదరాబాద్‌లోని శాస్త్రీపురం ప్రాంతానికి చెందిన సానియాబేగం (20), ఫలక్‌నుమాకు చెందిన మునీర్‌ (24)కు ఇటీవల వివాహం నిశ్చయమై, ఎంగేజ్‌మెంట్‌ కూడా ఘనంగా జరిగింది. 

ఈ క్రమంలో మొక్కు చెల్లించుకునేందుకు కాబోయే దంపతులిద్దరూ శనివారం ఇళ్లలో చెప్పి బైక్‌పై జేపీదర్గాకు వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా తిమ్మాపూర్‌ సమీపంలోని హెచ్‌ఐఎల్‌ పరిశ్రమ వద్ద వెనుక నుంచి అతివేగంగా వచి్చన ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సానియాబేగం తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మునీర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని  షాద్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఖైరాఉనీ్మసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement