breaking news
Chennai Love Story Movie
-
ఓటీటీకి చెన్నై లవ్ స్టోరీ.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈసారి థియేటర్లలో రవితేజ హీరోగా నటించిన ఇరుముడి రిలీజ్ కానుంది. దీనిపై ప్రస్తుతానికి బజ్ అయితే బాగానే ఉంది. తండ్రి కూతురు నేపథ్యానికి అయ్యప్ప స్వామి మాల, 41 రోజుల దీక్ష అనే పాయింట్ జోడించి దీన్ని తెరకెక్కించారు. ఈ మూవీతో పాటు అమీర్ లోగ్, ద రెడ్ బ్యాగ్ అనే చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం పెద్దఎత్తున సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ ఫ్రైడే చెన్నై లవ్ స్టోరీ, జన నాయగన్ మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు రెడీ అయిపోయాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.(ఇది చదవండి: బేబీ జంట మూవీ.. క్రేజీ సాంగ్ రిలీజ్)నెట్‌ఫ్లిక్స్ ప్యార్ ప్రేమ కళ్యాణం (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 21 ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21 ఐ స్వేర్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 22జీ5 జన నాయగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 21 ద గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో (హిందీ మూవీ) - ఆగస్టు 21జియో హాట్‌స్టార్ వెల్కమ్ టూ ద జంగిల్ (హిందీ సినిమా) - ఆగస్టు 21సోనీ లివ్ చెన్నై లవ్ స్టోరీ (తెలుగు సినిమా) - ఆగస్టు 21అమెజాన్ ప్రైమ్ క్లీనప్ కంపెనీ (హిందీ సిరీస్) - ఆగస్టు 21లయన్స్ గేట్ ప్లే స్నేక్స్ 5 (చైనీస్ మూవీ) - ఆగస్టు 21 మాంచెస్టర్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21 స్టిల్ వాటర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21ఆపిల్ టీవీ ప్లస్..అట్లాస్కింగ్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 21హెచ్‌బీవో మ్యాక్స్..మదర్మేరీ(హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 21 -
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో రవితేజ హీరోగా నటించిన 'ఇరుముడి' రిలీజ్ కానుంది. దీనిపై ప్రస్తుతానికి బజ్ అయితే బాగానే ఉంది. తండ్రి కూతురు నేపథ్యానికి అయ్యప్ప స్వామి మాల, 41 రోజుల దీక్ష అనే పాయింట్ జోడించి దీన్ని తెరకెక్కించారు. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి? దీనితో పాటు అమీర్ లోగ్, ద రెడ్ బ్యాగ్ అనే చిత్రాలు కూడా రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మరోవైపు ఓటీటీల్లో 19 వరకు కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో దళపతి విజయ్ 'జన నాయగన్', కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ', ప్యార్ ప్రేమ కల్యాణం అనే సినిమాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటికి తోడుగా వెల్కమ్ టూ ద జంగిల్, టాయ్ స్టోరీ 5 లాంటివి కూడా చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ చిత్రం స్ట్రీమింగ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 17 నుంచి 23 వరకు)జీ5జన నాయగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 21ద గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో (హిందీ మూవీ) - ఆగస్టు 21నెట్ఫ్లిక్స్ఫ్రీ ఫాల్: ఏ రెకనింగ్ ఫర్ బోయింగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 19హియర్ ద హోల్ టైమ్ (బ్రెజిలియన్ సినిమా) - ఆగస్టు 19ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20బ్లడ్ సాక్రిఫైస్ (స్వీడిష్ సిరీస్) - ఆగస్టు 20ఎస్&ఎక్స్ (జపనీస్ సిరీస్) - ఆగస్టు 20ప్యార్ ప్రేమ కళ్యాణం (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 21ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21హాట్స్టార్లాంటర్న్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 17 (స్ట్రీమింగ్ అవుతోంది)వెల్కమ్ టూ ద జంగిల్ (హిందీ సినిమా) - ఆగస్టు 21సోనీ లివ్చెన్నై లవ్ స్టోరీ (తెలుగు సినిమా) - ఆగస్టు 21అమెజాన్ ప్రైమ్టాయ్ స్టోరీ 5 (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 18 (రెంట్‌తో స్ట్రీమింగ్)నోవాక్ జకోవిచ్: ద వోల్ఫ్ ఇన్ వింటర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 20క్లీనప్ కంపెనీ (హిందీ సిరీస్) - ఆగస్టు 21ఆపిల్ టీవీ ప్లస్ద డైనస్టీ: యూకాన్ హస్కీస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20లయన్స్ గేట్ ప్లేస్నేక్స్ 5 (చైనీస్ మూవీ) - ఆగస్టు 21మాంచెస్టర్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21స్టిల్ వాటర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ) -
చెన్నై లవ్ స్టోరీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఓటీటీకి చెన్నై లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.60 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జూలై 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. కేవలం మౌత్ టాక్‌తో వసూళ్లు రాబట్టింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 21 నుంచే సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్.చెన్నై లవ్ స్టోరీ కథేంటంటే?..కాలేజ్ రోజుల నుంచే అజయ్ (త్రిగుణ్), నివి అలియాస్ నివేదిత (గౌరీ ప్రియ) ప్రేమించుకుంటారు. రెండేళ్ల స్నేహం, మూడేళ్ల ప్రేమతో పెళ్లికి సిద్దం అవుతారు. సరిగ్గా పెళ్లి రోజే అజయ్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోతాడు. వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాని అజయ్ చెప్పడంతో నివేదిత తట్టుకోలేకపోతుంది. ఆ బాధతో నివేదిత మందుకు బానిస అవుతుంది. ఆఫీసులో సరిగ్గా వర్క్ మీద ఫోకస్ కూడా పెట్టదు. ఇక నివేదిత రూంలోకి ఓ అతిథిగా వస్తాడు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం). అనాథ అయిన స్టీవెన్.. ఫిల్మ్ మేకర్ అవ్వాలని, చచ్చేలోపు ఒక్కసారి అయినా తన పేరుని సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని అవకాశాల కోసం తిరుగుతుంటాడు. స్టీవెన్ రాకతో నివిలో వచ్చిన మార్పులు ఏంటి? నివి, స్టీవెన్ ప్రయాణం ఎంత వరకు సాగుతుంది? దర్శకుడు అవ్వాలనే స్టీవెన్ కోరిక నెరవేరుతుందా? అజయ్ మళ్లీ నివి జీవితంలోకి వస్తాడా? చివరకు ఈ ప్రేమ కథలో ఎవరెవరు ఒకటి అవుతారు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. -
కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)
-
మేం లాభాల్లోనే ఉన్నాం: సాయి రాజేష్
‘‘నా దర్శకత్వంలో వచ్చిన ‘బేబి’ మూవీ తెలుగులో బ్లాక్‌బస్టర్ అయింది. ఈ మూవీ నా దర్శకత్వంలో హిందీలో రీమేక్ అవుతోంది. ఈ షూటింగ్లో బిజీగా ఉండటంతో ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు నేను దర్శకత్వం వహించాలనుకోలేదు’’ అని సాయి రాజేష్ చెప్పారు. కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీప్రియ హీరోయిన్గా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. దర్శకుడు సాయి రాజేష్ కథ అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు.సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా జూలై 24న విడుదలైంది. ఈ నేపథ్యంలో సాయి రాజేష్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘చెన్నై లవ్ స్టోరీ’కి మొదటి రెండు రోజులు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరిగింది. వాకౌట్ అనే ప్రచారం చేశారు. నిజంగా ప్రేక్షకులు వాకౌట్ చేస్తే 50 కోట్ల రూపాయల వసూళ్లు దక్కవు కదా? మేం లాభాల్లోనే ఉన్నాం. ఇంటర్వెల్ సీన్ చూశాక నాకంటే రవి నంబూరి ఈ సినిమాను బాగా రూపొందించాడనే ఫీల్ కలిగింది.నా డైరెక్షన్‌లోని ‘బేబి’ హిందీ రీమేక్ షూటింగ్ మరో 20 రోజులు బ్యాలెన్స్ ఉంది. సంపూర్ణేశ్ బాబుతో ‘హృదయ కాలేయం, కొబ్బరిమట్ట’ వంటి హిట్ మూవీస్ చేశాను. మా ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా చేస్తాను. అక్టోబర్ తర్వాత నా దర్శకత్వంలో ఓ తెలుగు చిత్రం ప్రకటిస్తాను’’ అని తెలిపారు. -
ప్రేక్షకుల ప్రశంసలే ముఖ్యం: రవి నంబూరి
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్ , సాయిరాజేశ్ నిర్మించిన ఈ చిత్రం జూలై 24న విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లో రవి నంబూరి మాట్లాడుతూ–‘‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం సంతోషంగా ఉంది. స్టీవెన్ శంకర్ పాత్రకు కిరణ్ పూర్తి న్యాయం చేశారు.నివి పాత్రకు శ్రీగౌరిప్రియను నేనే సూచించాను. ఆమె నటన భావోద్వేగ సన్నివేశాలను మరింత బలంగా నిలబెట్టింది. మణిశర్మగారి సంగీతం, ఆర్ఆర్ ఈ చిత్రానికి అతి పెద్దబలం. ఈ చిత్రంలోని ఇంటర్వెల్ యాక్సిడెంట్ సీన్ , క్లైమాక్స్‌లో డాగ్ సీక్వెన్స్ లను తెరకెక్కించడం సవాల్‌గా అనిపించింది. బడ్జెట్, సమయం ఎక్కువైనా నిర్మాతలు రాజీ పడకుండా సహకరించారు. బాక్సాఫీస్ వసూళ్ల కంటే ప్రేక్షకుల ప్రశంసలే నాకు ముఖ్యం. నా తర్వాతి చిత్రం ఎస్కేఎన్ తోనే ఉంటుంది’’ అన్నారు. -
నిజమైన విజయం లభించింది
‘‘ఒక సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటమే నిజమైన విజయం. ఆ సక్సెస్ మా ‘చెన్నై లవ్‌స్టోరీ’కి లభించింది’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. సాయి రాజేశ్ కథతో రవి నంబూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్కేఎన్, సాయి రాజేశ్ నిర్మించిన ఈ సినిమా జూలై 24న విడుదలైంది. ఈ చిత్రం రూ. 50 కోట్ల వసూళ్లు సాధించిందని యూనిట్ పేర్కొంది.శనివారం యూనిట్ నిర్వహించిన రూ. 50 కోట్ల బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘మా ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రేమకథా చిత్రం కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా? అనే సందేహం కలిగింది. ఇటీవల మేం థియేటర్స్ విజిట్ చేశాం. ప్రతి థియేటర్లో ఎక్కువ సంఖ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటున్నారు’’ అన్నారు. ‘‘ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో ఈ సినిమా ప్రయాణంలో మా నిర్మాతల నుంచి నేర్చుకున్నాను’’ అని తెలి పారు రవి నంబూరి.‘‘కంటెంట్ బాగుంటే విజయాన్ని అందించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారని మా సినిమాతో మరోసారి నిరూపితమైంది’’ అని చె΄్పారు శ్రీగౌరి ప్రియ.‘‘మా సినిమాకి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అన్నారు సహ–నిర్మాత ధీరజ్ మొగిలినేని. ‘‘8 రోజుల్లోనే కిరణ్ గారి కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం హ్యాపీగా ఉంది’’ అని చె΄్పారు ఎస్కేఎన్. -
చెన్నై లవ్‌స్టోరీ.. పీఆర్ టీమ్‌తో హిట్ కొట్టారా? కిరణ్ ఏమన్నారంటే?
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం చెన్నై లవ్‌స్టోరీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ. 40 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ ను యువసామ్రాట్ నాగచైతన్య ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కిరణ్ అబ్బవరం తనదైన శైలీలో విశ్లేషణాత్మకమైన సమాధానం ఇచ్చాడు.ప్రశ్నేంటి? కిరణ్ సమాధానమేంటి?చెన్నై లవ్‌స్టోరీ హిట్ అవ్వడానికి కిరణ్ అబ్బవరం పీఆర్ టీమ్ అని.. తన పారితోషికంలో కొంత పీఆర్‌కి ఖర్చు చేసి.. తనే టికెట్లు కొనిచ్చి థియేటర్స్ నింపేశాడనే రూమర్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. ఇదే విషయాన్ని నిన్నటి సక్సెస్ మీట్లో ఓ విలేకరి ప్రస్తావిస్తూ..‘సినిమా హిట్ అయిన తర్వాత పిఆర్ టీమ్ వల్లే ఈ హిట్ వచ్చిందని మీమ్స్ వస్తున్నాయి.. దీనిపై మీ స్పందన ఏంటి?' అని ప్రశ్నించాడు.దానికి కిరణ్ తనదైన శైలీలో జవాబు ఇచ్చాడు. ‘కేవలం పీఆర్తోనే హిట్లు కొట్టేటట్లయితే ప్రతి సినిమా అందరూ కొడతారు కదండి. ఎప్పుడు ఏదో ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒక మాట అనాలన్న ఆలోచనతో అలా అనకండి. ఏ సినిమా అయినా పిఆర్‌తో ఎవరు ఎంత రుద్దినా ఏమీ అవ్వదు, మనం ఆడియన్స్‌ని, వాళ్ల తీర్పుని రెస్పెక్ట్ చేద్దాం. చెన్నై లవ్ స్టోరీ సినిమాకి థియేటర్లలో 60% ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళు ట్విటర్లో ఉండేవాళ్లు కాదు.. కేవలం మౌత్ టాక్‌తో థియేటర్లకు వచ్చినవాళ్లు. ఏదో ఒకటి అనాలని అనడం చాలా ఈజీ, కానీ సక్సెస్ వచ్చినప్పుడు ఇలాంటివి ఉంటాయి.కొత్తేమి కాదు.. నాకు మొదటి సినిమా నుంచి ఇదంతా కొత్తేమీ కాదు. నాకు తెలిసింది ఒకటే.. కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి, అదే సక్సెస్ ఇస్తుంది. దయచేసి ఆడియన్స్‌ని, వాళ్ల రివ్యూని రెస్పెక్ట్ చేయండి. పిఆర్ తోనే వస్తుందంటే అందరి దగ్గర కోట్ల డబ్బులు ఉంటాయి, అందరికన్నా నా దగ్గర తక్కువ ఉన్నాయి.. అలా అయితే అందరి సినిమాలు రూ. 200 కోట్లు, రూ.300 కోట్లు రావాలి కదా. కాబట్టి ఊరికే పిఆర్ అని ప్రచారం చేయవద్దని కోరుతున్నాను' అని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్పు నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
‘చెన్నై లవ్‌స్టోరీ’ సక్సెస్ మీట్...ముఖ్య అతిథిగా హీరో నాగచైతన్య (ఫొటోలు)
-
ఇదే నిజమైన సక్సెస్: నాగచైతన్య
‘‘నాకు లవ్‌స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కోవిడ్ తర్వాత లవ్‌స్టోరీ సినిమాలు తగ్గిపోతుంటే బాధపడ్డాను. లవ్‌స్టోరీస్ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్తారా? వెళ్లరా? అని భయపడ్డాను. మెల్లిగా ఆ ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఈ ‘చెన్నై లవ్‌స్టోరీ’తో మరో కల్ట్ లవ్‌స్టోరీ సినిమాని ఇండస్ట్రీకి ఇచ్చారు. ‘చెన్నై లవ్ స్టోరీ’లో నేను కోరుకునే ప్రేమకథను చూశాను. పరిణతితో రాసిన ప్రేమకథ ఇది’’ అని నాగచైతన్య అన్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. సాయి రాజేష్ కథ అందించగా రవి నంబూరి దర్శకత్వం వహించారు. సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది.రిలీజైన 3 రోజుల్లోనే రూ. 40.1 కోట్లు వసూళ్లను రాబట్టిందని చిత్రయూనిట్ పేర్కొంది. మంగళవారం నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్‌కు అతిథిగా హాజరైన హీరో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘కష్టాలు, అడ్డంకులన్నీ దాటుకుని తనకంటూ ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు కిరణ్. నివిలాంటి క్యారెక్టర్‌ను గౌరి యాక్సెప్ట్ చేసి, తన పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెప్పించడం సులువైన పని కాదు. ఇంతమంచి కథ రాసి, మరో దర్శకుడికి ఇవ్వడంలోనే సాయి రాజేష్ గొప్పతనం కనిపిస్తోంది. కాంప్లెక్స్ ఎమోషన్స్ ఉన్న ఇలాంటి మెచ్యూర్డ్ లవ్‌స్టోరీని రవి నంబూరి చక్కగా తెరకెక్కించాడు.ఈ సినిమా టీమ్ అంతా గ్రౌండ్ లెవల్ నుంచి వచ్చారు. వీళ్ల విజయం నాకెంతో స్ఫూర్తినిస్తోంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని కొత్త వాళ్లకు కూడా వీళ్ల విజయాలు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఒక పోస్టర్ మీద కలెక్షన్స్ నంబర్స్ వేయడం కంటే ఇదే నిజమైన సక్సెస్. ఒక ప్రేమ కథకు ఇలాంటి నంబర్స్ బాక్సాఫీస్ వద్ద రావడం చాలా అద్భుతం’’ అని అన్నారు. నాలుగు రోజుల్లోనే ఆంధ్ర, నైజాం, సీడెడ్ అన్ని ఏరియాల్లో తమ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందని సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఆదరిస్తున్న ప్రేక్షకులకు కిరణ్ అబ్బవరం, ఎస్కేఎన్, సాయి రాజేష్, రవి నంబూరి ధన్యవాదాలు తెలిపారు. -
కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ.. రెండు రోజుల కలెక్షన్స్
కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ జంటగా వచ్చిన లవ్ ఎంటర్టైనర్ చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలిరోజే రూ. 12.3 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్, ఎస్ కే ఎన్ నిర్మించారు.ఈ మూవీ రెండు రోజు కూడా అదే జోరు కొనసాగించింది. రిలీజైన రెండు రోజుల్లోనే రూ.25.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన సానుకూల స్పందన రావడంతో రెండో రోజు వసూళ్లు రాబట్టింది. మొదటి రోజే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. బరిలో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. #ChennaiLoveStory continues its SENSATIONAL BOX OFFICE RAMPAGE! ❤️🔥❤️🔥𝟐𝟓.𝟐 𝐂𝐑+ 𝐆𝐑𝐎𝐒𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in just 𝟐 𝐃𝐀𝐘𝐒! 🔥🔥Sunday kickstarts on a BLOCKBUSTER note at the box office! 💥💥A CULT CLASSIC BLOCKBUSTER in every sense! 😍🫶🏻Book your tickets now 🎟️… pic.twitter.com/ZVtx1U5WO9— Mass Movie Makers (@MassMovieMakers) July 26, 2026 -
నేనే దర్శకత్వం వహించినా.. ఇంత బాగా తీసేవాడిని కాదు : సాయి రాజేష్
‘‘చెన్నై లవ్ స్టోరీ’కి నేను కథా రచయితను అయినా నాకంటే ఎక్కువగా ఈ కథను ప్రేమించి, అర్థం చేసుకుని సినిమా తీశారు రవి నంబూరి. నేను దర్శకుడిని అయినా ఇంత బాగా తెరకెక్కించేవాడిని కాదేమో. ‘బేబి’ తర్వాత మా గౌరవాన్ని పెంచే సినిమా చేయాలనుకున్నాం. ‘బేబి’ కన్నా ‘చెన్నై లవ్ స్టోరీ’ చాలా గొప్ప సినిమా’’ అని సాయి రాజేష్ తెలిపారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. శనివారం జరిగిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో రవి నంబూరి మాట్లాడుతూ– ‘‘మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఏ దర్శకుడికైనా ఓ కల. ఆ కల నిజం కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.శ్రీ గౌరీప్రియ మాట్లాడుతూ– ‘‘కొంచెం ఎమోషనల్‌గా ఉన్నాను. నాకు చాలా ముఖ్యమైన రోజు ఇది. మా అమ్మ ఉండి ఉంటే నిజంగా చాలా సంతోషపడేవారు. కానీ, మా అమ్మ రూపంలో విశాల, ప్రమోదినిగార్లు అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెబుతుంటారు. ఇక్కడికి రాగానే ‘చెన్నై లవ్ స్టోరీ’లో నువ్వు చేసిన నివి పాత్రకు నీకు మంచి పేరు, ప్రశంసలు వస్తున్నాయి... అమ్మ చూసుంటే చాలా బాగుండేది’’ అని వారు అన్నారు. కానీ, మా అమ్మ చూస్తోంది.. తన వల్లే నాకీ పేరు వస్తోందని నా ఫీలింగ్’’ అన్నారు. ‘‘అప్పట్లో బాలచందర్, భారతీరాజాగారి కథల్లా సాయి రాజేష్‌గారి కథల్లో లోతు ఉంటుంది. మా సినిమా తొలి రోజు రూ. 12.3 కోట్లు వసూలు చేసిందని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని ఎస్కేఎన్ పేర్కొన్నారు. ‘‘నా కెరీర్లో స్టీవెన్ శంకర్ అనే గుర్తుండిపోయే పాత్ర ఇచ్చిన రవి నంబూరిగారికి థ్యాంక్స్’’ అన్నారు కిరణ్ అబ్బవరం. కెమెరామేన్ విశ్వాస్ డేనియల్, రచయిత అనంత శ్రీరామ్, నటీనటులు ప్రమోదిని, త్రిగుణ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘చెన్నయ్ లవ్ స్టోరీ’ సినిమా చూస్తూ అనంత లోకాలకు..
హైదరాబాద్: థియేటర్లో సినిమా చూస్తున్న ఓ కార్మికుడు గుండెనొప్పితో కన్నుమూశాడు. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన మేరకు.. నిజామాబాద్‌కు చెందిన డొక్కా కృష్ణ (35) కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఉంటూ రోజు కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం మరో స్నేహితుడితో కలిసి అర్జున్ థియేటర్లో మార్నింగ్ షో(చెన్నయ్ లవ్ స్టోరీ)కు వెళ్ళాడు.ఇంటర్వెల్ సమయంలో బయటకు వెళ్లి వచ్చిన కృష్ణ కూర్చున్న కుర్చీలోనే పడుకుని ఉన్నాడు. సినిమా అయిపోయినా లేవకపోవడంతో థియేటర్ నిర్వాహకులకు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో రామ్‌దేవ్‌రావ్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సందడిగా 'చెన్నై లవ్ స్టోరీ' సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
అమ్మ ఉంటే చాలా సంతోషించేది.. హీరోయిన్ ఎమోషనల్
ఈ వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'చెన్నై లవ్ స్టోరీ'కి పాజిటివ్ టాక్ వస్తోంది. సెకండాఫ్ మీద కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా పర్లేదని అంటున్నారు. మరోవైపు ఇందులో హీరోయిన్గా చేసిన తెలుగమ్మాయి శ్రీ గౌరిప్రియకి ప్రశంసలు దక్కుతున్నాయి. అన్ని రకాల ఎమోషన్స్ అద్భుతంగా పండిందని అంతా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈమె, సక్సెస్ మీట్లో అమ్మని తలుచుకుని ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: రిలీజ్ రోజే కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?)'ఇంత మంచి పేరు, విజయం వస్తున్నప్పుడు మా అమ్మ ఉండి ఉంటే చాలా సంతోషించేవారు. నన్ను ఇప్పుడు ఆమె చూసి ఉంటే బాగుండేదని అందరూ అంటున్నారు. కానీ మా అమ్మ ఎప్పుడూ పైనుంచి నన్ను చూస్తూనే ఉంటుంది' అని గౌరిప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.కిరణ్ అబ్బవరం, గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో రవి నంబూరి దర్శకుడిగా పరిచయమయ్యారు. 'బేబి' తీసిన దర్శకుడు సాయి రాజేశ్.. ఈ చిత్రానికి కథ అందించారు. ఎస్కేఎన్ నిర్మించారు. ఇకపోతే ప్రీమియర్లకే రూ.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. తొలిరోజు మరో రూ.6 కోట్ల వసూళ్లు.. అంటే ఓవరాల్‌గా ఇప్పటివరకు రూ.9 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్, శ్రీ గౌరి చేయాల్సింది కాదు..!)స్టేజ్‌పై హీరోయిన్ గౌరీ ప్రియ ఎమోషనల్‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర విజయోత్సవ సమావేశంలో హీరోయిన్ గౌరీ ప్రియ భావోద్వేగానికి లోనయ్యారు. “ఇంత మంచి పేరు, విజయం వస్తున్నప్పుడు మా అమ్మ ఉండి ఉంటే చాలా సంతోషించేవారు.. నన్ను చూసి ఉంటే బాగుండేదని అందరూ అంటున్నారు. కానీ మా అమ్మ ఎప్పుడూ పైనుంచి… pic.twitter.com/8x0pieJSmx— ChotaNews App (@ChotaNewsApp) July 25, 2026 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘చెన్నై లవ్‌స్టోరీ’
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్, ఎస్ కే ఎన్ నిర్మించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 24) విడుదలైన ఈ చిత్రానికి ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సెకండాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదని పలు న్యూస్ వెబ్సైట్లు తమ రివ్యూలో పేర్కొన్నాయి. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా దూసుకెళ్తోంది. కేవలం కొన్ని చోట్ల మాత్రమే వేసిన ప్రీమియర్ షోకి రూ. 3.13 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక తొలి రోజు మొత్తంగా రూ. 12.3 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. బరిలో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్, శ్రీ గౌరి చేయాల్సింది కాదు..!
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా వచ్చిన ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ లవ్ స్టోరీకి యూత్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రవి నంబూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఆదరణ లభిస్తోంది.ఇక సినిమా సంగతి అటుంచితే ఈ మూవీకి మొదటి అనుకున్నది కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ కాదని తెలుస్తోంది. ఈ లవ్ స్టోరీకి బేబి జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చేయాల్సింది. కానీ పలు కారణాలు చేత వారిద్దరూ ఈ కల్ట్ బొమ్మ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. అలా ఈ ఛాన్స్ కిరణ్, శ్రీగౌరి ప్రియకు దక్కింది. గతంలో సాయి రాజేశ్ డైరెక్షన్లో వచ్చిన కల్ట్ ప్రేమకాథా చిత్రం బేబీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
రిలీజ్ రోజే కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?
కిరణ్ అబ్బవరం, గౌరిప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా థియేటర్లలోకి వచ్చింది. ప్రేమకథగా తీసిన ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్లే కొన్నిచోట్ల పాజిటివ్ టాక్ మరికొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఒకటి రెండు రోజులు ఆగితే అసలు ఫలితం ఏంటనేది తేలుతుంది. ఇదంతా పక్కనబెడితే రిలీజైన రోజే మూవీ టీమ్, కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేయడం ఇక్కడ విచిత్రంగా అనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)'చెన్నై లవ్ స్టోరీ' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని కొన్నిచోట్ల గురువారం రాత్రి ప్రీమియర్స్ వేశారు. కేవలం పెయిడ్ ప్రీమియర్ షోల ద్వారానే రూ.3.13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే కిరణ్ అబ్బవరం స్టార్ హీరో కాదు, అలా అని టికెట్ రేట్లు కూడా పెంచలేదు. ప్రీమియర్లు కూడా గురువారం రాత్రి ఒకటి రెండు షోలు వేశారు. అంతమాత్రానికే రూ.3 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయా అనేది ఇక్కడ ప్రశ్న.టాలీవుడ్లో ఒకప్పుడు కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తే జనాలు కూడా అదే నిజమని నమ్మేసేవాళ్లు. కానీ తర్వాత రోజుల్లో దిల్ రాజు, నాగవంశీ లాంటి ప్రముఖ నిర్మాతలే.. ప్రేక్షకులని ఆకట్టుకోవడం కోసం కొంత మొత్తం పెంచేసి నంబర్లు వేస్తుంటామని బాహాటంగానే ఒప్పుకొన్నారు. దీంతో ఆడియెన్స్ కూడా వసూళ్ల పోస్టర్ రిలీజ్ కాగానే ఇది నిజమా కాదా అని కనిపెట్టేస్తున్నారు.'చెన్నై లవ్ స్టోరీ' విషయానికొస్తే.. నివి(గౌరీప్రియ) తన ప్రియుడు అజయ్(త్రిగుణ్)తో పెళ్లికి రెడీ అవుతుంది. కానీ ముహూర్తం టైంకి మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి, అజయ్ వెళ్లిపోతాడు. దీంతో హీరోయిన్ చెన్నై వెళ్లిపోతుంది. దేవదాసులా మందుకు బానిసవుతుంది. ఆ టైంలో స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) ఈమెకు పరిచయమవుతాడు. దర్శకుడు అవ్వాలనే ఆశతో చెన్నైలోకి అడుగు పెట్టిన ఇతడికి నివి ఫ్రెండ్స్ గ్యాంగే ఆశ్రయమిస్తారు.తొలుత స్టీవెన్, నివికి చిరాకు తెప్పించినా తర్వాత అతడికి దగ్గరవుతుంది. మళ్లీ ఈమెలో ప్రేమ చిగురిస్తుంది. తర్వాత వాళ్లిద్దరి ప్రయాణం ఎలా సాగింది? వీళ్ల ప్రేమకథలో ఎదురైన సవాళ్లేంటి? మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి పెళ్లి పీటలపై నివిని వదిలేసి వెళ్లిపోయిన అజయ్.. మళ్లీ ఆమె జీవితంలోకి ఎందుకొచ్చాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ) -
రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ'.. ట్రెండింగ్‌లో గౌరిప్రియ (ఫొటోలు)
-
చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: చెన్నై లవ్ స్టోరీ నటీనటులు : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, త్రిగుణ్ , సిరి హనుమంతు, నవీన్ తదితరులునిర్మాతలు - ఎస్ కేఎన్, సాయి రాజేశ్కథ : సాయి రాజేశ్స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - రవి నంబూరిసంగీతం : మణిశర్మఎడిటర్ : సంతోష్ నాయుడుసినిమాటోగ్రఫీ : విశ్వాస్ డేనియల్విడుదల తేదీ: 24 జులై 2026మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్, ఎస్ కే ఎన్ నిర్మించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ . ఈ మూవీ రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని జూలై 24న రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏంటి? ఈ చిత్రం ఆడియెన్స్ ఏ మేరకు నచ్చుతుంది? అన్నది ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే?కాలేజ్ రోజుల నుంచే అజయ్ (త్రిగుణ్), నివి అలియాస్ నివేదిత (గౌరీ ప్రియ) ప్రేమించుకుంటారు. రెండేళ్ల స్నేహం, మూడేళ్ల ప్రేమతో పెళ్లికి సిద్దం అవుతారు. సరిగ్గా పెళ్లి రోజే అజయ్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోతాడు. వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాని అజయ్ చెప్పడంతో నివేదిత తట్టుకోలేకపోతుంది. ఆ బాధతో నివేదిత మందుకు బానిస అవుతుంది. ఆఫీసులో సరిగ్గా వర్క్ మీద ఫోకస్ కూడా పెట్టదు. ఇక నివేదిత రూంలోకి ఓ అతిథిగా వస్తాడు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం). అనాథ అయిన స్టీవెన్.. ఫిల్మ్ మేకర్ అవ్వాలని, చచ్చేలోపు ఒక్కసారి అయినా తన పేరుని సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని అవకాశాల కోసం తిరుగుతుంటాడు. స్టీవెన్ రాకతో నివిలో వచ్చిన మార్పులు ఏంటి? నివి, స్టీవెన్ ప్రయాణం ఎంత వరకు సాగుతుంది? దర్శకుడు అవ్వాలనే స్టీవెన్ కోరిక నెరవేరుతుందా? అజయ్ మళ్లీ నివి జీవితంలోకి వస్తాడా? చివరకు ఈ ప్రేమ కథలో ఎవరెవరు ఒకటి అవుతారు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే?..ప్రేమ కథల్లో చెన్నై లవ్ స్టోరీ మాత్రం కాస్త కొత్త ప్రేమ కథే అని చెప్పుకోవాలి. ప్రేమ కథ అన్నాక.. ప్రేమికుడు, ప్రేయసి ఉంటుంది.. వీరి మధ్య ఓ సంఘర్షణ ఉంటుంది.. ఇద్దరినీ దూరం చేసే కారణం ఏదో ఒకటి ఉంటుంది.. ఈ పాయింట్స్‌ని పట్టి చూస్తే ఈ ప్రేమ కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. తొలి ప్రేమ తోపు కాదే అన్న మాట, పాటలోనే ఈ కథ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. అయితే ఈ కథను ఎలా డీల్ చేశారన్న దానిపైనే రిజల్ట్ ఆధార పడి ఉంటుంది. తొలి ప్రేమ అయినా, మలి ప్రేమ అయినా ప్రేయసి సుఖాన్ని, సంతోషాన్నే ప్రేమికుడు కోరుకోవాలి. నివి ప్రేమలో విఫలం అవ్వడం, పెళ్లి క్యాన్సిల్ అవ్వడం, ఆపై మందుకు బానిస అవ్వడం వంటి సీన్లతో ఆరంభం నుంచే ప్రేక్షకుడ్ని హుక్ చేసేస్తాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో పాత్రను పరిచయం చేయడం, అక్కడితో కాస్త ఎంటర్టైన్మెంట్ ట్రాక్ నడిపించడంతో కథ అలా ముందుకు వెళ్తుంటుంది. హీరో, హీరోయిన్ల మధ్య మొదట్లో వచ్చే గొడవలు, ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ చిగురించడం వంటి సీన్లతో కథ మరింత స్పీడుగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అయితే అన్నీ బాగానే ఉన్నాయ్ అని అనుకునే టైంకి కథ ఎవ్వరూ ఊహించని టర్న్ తీసుకుంటుంది. ఆ ఇంటర్వెల్ బ్లాక్‌తో అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. సెకండాఫ్‌ని ఎలా డీల్ చేస్తారు? అసలు కథ ఎలా ముందుకు సాగుతుంది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్లతో ద్వితీయార్దాన్ని ప్రేక్షకుడు చూస్తాడు. ఇక ఆడియెన్స్ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగానే కథనం సాగుతుంటుంది. హీరో, హీరోయిన్ల ట్రాక్ అక్కడ చాలా కొత్తగా అనిపిస్తుంది. మళ్లీ అజయ్ పాత్రను తీసుకు రావడంతో కథ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఆ తరువాత కథ అక్కడక్కడే తిరుగుతుండటం, చాలా వరకు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లోని కొన్ని ఎమోషనల్ సీన్స్ గుండెల్ని మెలిపెట్టేలా ఉంటాయి. క్లైమాక్స్‌కి కన్నీరు పెట్టాల్సిందే. అలా చివరకు ఓ సంతృప్తితో ప్రేక్షకుడు బయటకు వెళ్తాడు. అయితే ద్వితీయార్దాన్ని ఇంకాస్త బెటర్‌గా మల్చి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేదనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..కిరణ్ అబ్బవరం తనకు ఇచ్చిన స్టీవెన్ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో అమాయకుడిగా అందరినీ నవ్విస్తూ కనిపించే కిరణ్ అబ్బవరం, సెకండాఫ్‌లో మరింత కొత్తగా కనిపిస్తాడు. చాలా వరకు ఎమోషనల్ సీన్స్‌తో కిరణ్ అబ్బవరం ఏడ్పించేస్తాడు. గౌరి ప్రియ అయితే ఈ చిత్రానికి సోల్. ఆమె కారెక్టర్‌ను అద్భుతంగా రాసుకున్నారు.. ఆమె కూడా అంతే అద్భుతంగా నటించారు. త్రిగుణ్ పాత్ర కూడా బాగుంటుంది. హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్, మురుగన్ తల్లి, కరుణ కుమార్ పాత్రలు బాగుంటాయి. మిగిలిన వారంతా తమ పరిధి మేరకు మెప్పించారు.సాంకేతిక విషయాలకు వస్తే.. ఈ సినిమాకి మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం అని చెప్పాలి. తనదైన బీజియం తో మ్యాజిక్ చేశాడనే చెప్పుకోవచ్చు. పాటలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కెమెరావర్క్ గొప్పగా అనిపిస్తుంది. విజువల్స్ ఎంతో ప్లెజెంట్‌గా ఉంటాయి. మాటలు మనసుని హత్తుకుంటాయి. క్యాస్టూమ్స్, ఎడిటింగ్ అన్నీ బాగుంటాయి. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా అనిపిస్తాయి.అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
నారింజ రంగు డ్రెస్‌లో మెరిసిపోతున్న నటి సిరి హనుమంత్ (ఫొటోలు)
-
చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
చెన్నైతో నా లవ్ స్టోరీ: చిరంజీవి
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా జూలై 24న విడుదల కానుంది. బేబీ, కలర్ ఫోటో టీమ్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందన తెచ్చాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను చెన్నైలో గడిపిన రోజులు గుర్తుచేసుకున్నారు. 'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నేనొక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాను. చెన్నైతో లవ్ స్టోరీ రోజులు గుర్తొచ్చాయి. చెన్నైతో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది. ఇక్కడ కదా మన బతుకు తెరువు, ఇక్కడ కదా మన ఫ్యూచర్, ఈ స్టూడియోల్లోనే కదా మనం నటుడిగా నిలదొక్కుకోవాలి.. ఇక్కడే కదా మనం పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి అంటూ అప్పట్లో నేను చెన్నై రోడ్ల మీద తిరిగాను. అక్కడే కార్లలో తిరిగాను. అనంతరం అక్కడే స్టార్ స్టేటస్ అందుకున్న చెన్నై రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అనే ఈ సినిమా టైటిల్ వినగానే నాకు చెన్నైతో లవ్ స్టోరీ గుర్తుకొచ్చింది ఈ టైటిల్లో ఆ మ్యాజిక్ ఉంది'' అని చిరంజీవి అన్నారు. అభిమానులను తాను ఎంతో ఇష్టపడతానని, కానీ అదే అభిమానులు పైకొస్తే తన ప్రాణప్రదంగా చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. నా అభిమానుల వల్లే ఈ ఈవెంట్‌కి వచ్చాను. ఎస్కెఎన్, సాయి రాజేష్, దర్శకుడు రవి, నా అభిమానులు. కిరణ్ అబ్బవరం వాళ్ల అన్న నా అభిమాని, కిరణ్ పవన్ కళ్యాణ్ అభిమాని. వీళ్లందరి అభిమానం నన్ను ఇక్కడికి రప్పించింది. అభిమానులు కేవలం అభిమానమే కాకుండా తమను ప్రేరణగా తీసుకొని పైకి రావాలి. ఎస్కెఎన్, సాయి రాజేష్ లాంటి వారు ఏమి లేకుండా వచ్చి ఎదిగారు. కష్టాలు, అవమానాలు ఉన్నా కష్టపడితే విజయం సాధించవచ్చు. ఈ వేదికపై ఉన్న వీళ్లంతా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా అసాధారణ కలలు కన్నారు. అదే వీళ్లను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరు కూడా కలలు కనండి.. వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నించండి... తప్పకుండా విజయం సాధిస్తారు.. అందుకు నేనే ఉదాహరణ. కంఫర్ట్ జోన్ వదిలేయాలి.. కష్టానికి ఎదురెళ్లాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయండి. అప్పట్టో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి మహానటుల మధ్య నేను ప్రత్యేకంగా కనిపించాలని చాలా కష్టపడ్డాను. అలాగే కిరణ్ అబ్బవరం కూడా రాయచోటిలో పుట్టి, తిరుపతిలో సినిమాలు చూసి పెరిగి, ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాడు. అలాంటి కొత్తవాళ్లు ఇంకా ఇండస్ట్రీకి రావాలి. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి మాట్లాడుతూ.. నేను డ్యాన్సులు అంత బాగా చేశానంటే మణిశర్మ సంగీతం వల్లే. ఆయన లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేకపోతే నేను లేను. చివరగా చిరంజీవి సినిమా యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జోడీగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. దర్శకుడు సాయి రాజేశ్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై సాయి రాజేశ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) విడుదలవుతోంది. -
హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)
-
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నటించిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' ఈ గురువారం థియేటర్లలోకి రానుంది. తెలుగులో అయితే కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్ కానుంది. దీనితో పాటు కాజల్ 'ద ఇండియా స్టోరీ' సహా హే చికితా, చంద్రప్పన్, కాగితం పడవలు లాంటి చిన్న చిత్రాలు బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈ వీకెండ్ చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ అయితే లేవు. ఉన్నంతలో పల్లిచట్టంబి, కాన్ సిటీ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి సిరీస్‌లు కాస్తోకూస్తో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఇంకేమైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్ లాంటివి ఉంటాయేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 20 నుంచి 26 వరకు)నెట్ఫ్లిక్స్ఏ టాక్సిక్ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 22ఎలైట్ ఫోర్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 22రాన్సమ్ కెన్యన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23ద డెట్ కలెక్టర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 23ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) - జూలై 2472 అవర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) - జూలై 24ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 24 (రూమర్ డేట్)హాట్స్టార్స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25అమెజాన్ ప్రైమ్ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 24జీ5అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) - జూలై 24ప్రేమ్ షాట్స్ (బెంగాలీ సిరీస్) - జూలై 24సోనీ లివ్పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24లయన్స్ గేట్ ప్లేప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 24ఆపిల్ ప్లస్ టీవీద డింక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24సన్ నెక్స్ట్సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) - జూలై 24(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్) -
ట్రైలర్ చూస్తుంటే సినిమా హిట్ అనిపిస్తోంది: నిర్మాత అల్లు అరవింద్
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరై, ట్రైలర్‌ను రిలీజ్ చేసిన అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ ట్రైలర్‌లోని భావోద్వేగాలను గమనిస్తే ఇది కచ్చితంగా హిట్ అయ్యే సినిమా అనే భావన కలుగుతోంది.కిరణ్ ఎంతో సహజంగా నటిస్తారు. మైత్రీ రవిగారు ఈ సినిమాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ నెల 24న ‘చెన్నై లవ్‌స్టోరీ’ టీమ్ అందరికీ మంచి విజయం లభించబోతోంది’’ అన్నారు. ‘‘నానీని నేచురల్ స్టార్ అని పిలుస్తాం. అలాగే కిరణ్‌ను ఒరిజినల్ స్టార్ అని పిలవాలని ఉంది. మా బ్యానర్లో నెక్ట్స్ కిరణ్ చేయబోయే సినిమాలో ఒరిజినల్ స్టార్ అని వేస్తాం’’ అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో రవి నంబూరి, ఎస్కేఎన్, సాయి రాజేష్, సహ–నిర్మాత ధీరజ్ మొగిలినేని తదితరులు పాల్గొన్నారు. -
కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్‌స్టోరీ' ట్రైలర్ రిలీజ్
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'. వచ్చే శుక్రవారం (జూలై 24) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మూడు నాలుగు పాటల్ని వదిలారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంటూ మూవీ చూడాలని ఆసక్తి పెంచుతోంది.(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ట్రైలర్ బట్టి చూస్తే.. చెన్నైలో ఉండే హీరోయిన్ అప్పటికే లవ్‌లో ఫెయిలై, ఆ బాధని మర్చిపోయేందుకు రోజంతా తాగుతూ ఉంటుంది. ఇక సినిమా డైరెక్టర్ అవ్వాలని ఈమె ఉంటున్న చోటుకి హీరో వస్తాడు. తనదైన శైలిలో హీరోయిన్ మూడ్ మార్చేందుకు ప్రయత్నిస్తాడు. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. తర్వాత ఈ లవ్ స్టోరీ ఎలాంటి టర్న్‌లు, ట్విస్టులు తీసుకుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: జాతీయ సినీ అవార్డుల్లో తెలుగు సినిమా ప్రభంజనం) -
‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
చెన్నై లవ్‌స్టోరీలో స్వచ్ఛమైన ప్రేమను చూస్తారు
‘‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రంలో స్వచ్ఛమైన ప్రేమను చూస్తారు. ఈ సినిమాలోని సన్నివేశాలకు ప్రేక్షకులు బాగా రిలేట్ అవుతారు. ఈ చిత్రంలోని పాటలు చూసి, అందరూ క్లాస్ అనుకుంటున్నారు. కానీ ఇదిప్రాపర్ మాస్ మూవీ’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్ , సాయి రాజేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. బుధవారం (జూలై 15) కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో రవి నంబూరి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో స్టీవెన్ (కిరణ్ అబ్బవరం), నివి (గౌరి) పాత్రలు బలంగా కనిపిస్తాయి’’ అన్నారు. ‘‘చెన్నైకి, ఈ సినిమా కథకు సంబంధం ఉంది. అందుకే చెన్నై లవ్‌స్టోరీ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు సాయి రాజేష్. ‘‘మా అందరి కెరీర్లో హయ్యస్ట్ థియేటర్స్‌లో ‘చెన్నై లవ్‌స్టోరీ’ రిలీజ్ కానుంది’’ అన్నారు ఎస్కేఎన్ . ‘‘ప్రేమ అనే పదం ఒక్కో టైమ్‌లో ఒక్కోలా వినిపిస్తుంటుంది. ఇప్పుడు నాకు ప్రేమంటే చెన్నై లవ్‌స్టోరీనే’’ అన్నారు సహనిర్మాత ధీరజ్ మొగిలినేని. ‘‘ఈ సినిమాలోని నా పాత్రలో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి’’ అన్నారు శ్రీ గౌరి ప్రియ. నటి సిరి హన్మంతు మాట్లాడారు. -
‘చెన్నై లవ్‌స్టోరీ’రిలీజ్‌పై ఓటీటీ ఒత్తిడి లేదు : నిర్మాత ఎస్కేఎన్
సినిమాల రిలీజ్ డేట్‌ని ఓటీటీ సంస్థలు ఫిక్స్ చేస్తున్నాయి అనేది వాస్తవమే. అయితే వాళ్లు కొన్ని నెలల ముందే ప్రొడ్యూసర్ కు చెబుతారు. ఈ విషయంలో నాకు ఒత్తిడి ఎదురుకాలేదు. కానీ కొందరు ప్రొడ్యూసర్స్ మాత్రం తాము ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు. మా ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ ఓటీటీ డీల్ కంప్లీట్ అయ్యింది. ఆ సంస్థనే ఆ విషయాన్ని ప్రకటిస్తుంది’ అన్నారు నిర్మాత ఎస్కేఎన్. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించగా అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మించిన చిత్రం చెన్నై లవ్‌స్టోరీ. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ చెన్నైలో నివస్తున్న తెలుగు జంట స్టోరీ ఇది. అందుకే చెన్నై లవ్ స్టోరీ అని సినిమా టైటిల్ పెట్టాం. బేబి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత మేకర్స్ గా మాపై అంచనాలు పెరిగాయి. అందుకే ఒక మంచి మూవీతోనే ఆడియెన్స్ ముందుకు రావాలని ఏడాది సమయం తీసుకున్నాం. నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ చెప్పిన ఈ కథ, కథనం బాగా నచ్చాయి. మా కాంబినేషన్ లోనే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం.→ ప్రస్తుతం మా సినిమా తెలుగు రిలీజ్ వర్క్స్ స్పీడ్ గా జరుగుతున్నాయి. తమిళ్ రిలీజ్ అదే వారం చేయాలా, ఒకట్రెండు వారాలు ఆగి చేయాలా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే తమిళంలో కొన్ని పెద్ద మూవీస్ రిలీజ్ కు వస్తున్నాయి.→ మేము అనుకున్న కథకు కిరణ్ అబ్బవరం వందశాతం న్యాయం చేశారు. ఆయన ఇప్పటిదాకా బాయ్ నెక్ట్స్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. మాస్ క్యారెక్టర్స్ లో నటించారు. కిరణ్ నటనలోని ఒక మెచ్యూరిటీని ఈ సినిమాలో చూస్తారు. ఈ ఏడాది అన్ని అవార్డ్స్ లో కిరణ్ నామినేషన్స్ లో ఉంటుందని మాత్రం గట్టిగా చెప్పగలను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా పేరు తెచ్చుకుని ప్రొడ్యూసర్ గా కొత్త వాళ్లను పరిచయం చేస్తూ అవకాశాలు ఇస్తున్నారు కిరణ్. ఆయన ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ ను ఈ సినిమా టైమ్ లో చూశాను.→ సాయి రాజేష్ కథల్లో హీరోయిన్స్ కు మంచి ప్రాధాన్యత ఉంటుందని మీకు తెలుసు. ఈ సినిమా కథ అనుకున్నాక, ఇంత బలమైన పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది, ఆ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారని డిస్కషన్స్ చేశాం. సినిమా ప్రారంభమే హీరోయిన్ సీన్ తో మొదలవుతుంది. మేము తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నాం. శ్రీ గౌరి ప్రియను సెలెక్ట్ చేసుకున్నాం. ఆమె ఈ పాత్రకు వందశాతం న్యాయం చేసింది. ఈ సినిమాలోని ఎమోషన్స్ చాలా రోజులు మనకు గుర్తుంటాయి.→ తొలిప్రేమ అయినా మలిప్రేమ అయినా మన జీవితంలో భాగమే. తొలి ప్రేమ దక్కని వారిలో మళ్లీ ప్రేమ పుట్టదని చెప్పలేం. ఏదైనా జీవితం ముందుకు సాగాల్సిందే. బేబి సినిమాను తొలి ప్రేమ నేపథ్యంగా నిర్మించాం. ఈ సినిమాలో మలి ప్రేమ కూడా గొప్పదే అని చెబుతున్నాం. మూవీలో విషాదకరంగా ఉండదు. బేబి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్ల సమయం తీసుకుని మేము ఈ చిత్రాన్ని నిర్మించామంటే మాదైన ఒక మార్క్ ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు.→ కథను నమ్మి ఆ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలి అనేది ప్రొడ్యూసర్ నిర్ణయం. ఇది ఎమోషన్స్ తో ఆకట్టుకోవాల్సిన కథ. ఆ ఎమోషన్స్ కోసం విజువల్ బ్యూటీ అవసరం. అందుకోసం నేచురల్ గా ఆ విజువల్స్ వచ్చేవరకు ఆగి షూటింగ్ చేశాం. వర్షం, సూర్యోదయం నేపథ్యంగా సాగే సీన్స్ కోసం సహజంగా వచ్చేలా వెయిట్ చేసి చేశాం. చెన్నై, పాండిచ్చేరి, వైజాగ్, చీరాల..ఇలా పలు లొకేషన్స్ లో షూటింగ్ జరిపాం. అందుకే షూటింగ్ డేస్ పెరిగాయి. సినిమాకు కావాల్సినంత రైట్ ఎమోషన్స్ వచ్చేలా ఔట్ పుట్ తీసుకున్నాం. ఇంకా కొన్ని తక్కువ డేస్ లో కూడా ఇదే క్వాలిటీతో సినిమా చేయొచ్చు. అదొక ఆర్ట్. ఆ ఆర్ట్ ను నేను ఇంకా నేర్చుకునే క్రమంలో ఉన్నాను.→ బేబి సినిమాకు కల్ట్ లవ్ స్టోరీ అని పేరొచ్చింది. ఈ సినిమాకు క్లాసిక్ లవ్ స్టోరీ అనే పేరొస్తుంది. ఈ కథ విన్న వెంటనే మణిశర్మ మా మూవీ చేస్తానని ఒప్పుకున్నారు. ఆయన చేసిన పాటలు ఎంత బాగుంటాయో మనకు తెలుసు. ట్యూన్ ఆకట్టుకుంటూనే లిరిక్స్ అర్థమవుతాయి. ఈ సినిమాలో అనంత శ్రీరామ్ సింగిల్ కార్డ్ రాశారు. ప్రతి లిరిక్ అర్థమయ్యేలా పాటను ఎంజాయ్ చేయొచ్చు. కథలోని భావోద్వేగాలు తెలిసేలా మెచ్యూర్డ్ గా మ్యూజిక్ చేయడంలో తనకు తానే సాటి అని మణిశర్మ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.→ డైరెక్టర్ రవి నంబూరి మాకు సోదరుడి లాంటి వారు. ఆయన మాతో ఎప్పటినుంచో ట్రావెల్ చేస్తున్నారు. మాకు వెబ్ సిరీస్ స్టోరీ ఇచ్చారు. బేబి మూవీకి వర్క్ చేశారు. ఆయనతో ఈ సినిమా నిర్మించడం హ్యాపీగా ఉంది. రవి టాలెంటెడ్ టెక్నీషియన్, డైలాగ్స్ బాగా రాస్తాడు. డైరెక్టర్ సాయి రాజేష్ , రవి నంబూరి కలిసి ట్రావెల్ చేస్తున్నారు, ఐడియాస్ షేర్ చేసుకుంటారు. సాయి రాజేష్ అందరికీ ఫ్రీడమ్ ఇచ్చి పనిచేయించుకుంటారు. అందుకే ఆయనకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.→ సినిమాను రాజీ లేకుండా నిర్మించడమే మా చేతుల్లో ఉంది. ఆ సినిమాకు ప్రేక్షకులు ఎంత కలెక్షన్స్ ఇస్తారు అనేది తెలియదు. ఇప్పుడు ఇంత కలెక్ట్ చేస్తుందని నేను చెబితే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. మా సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతుంది. అందరి ప్రసంశలు పొందుతుంది. బేబి లాగే మాకు మంచి పేరు తీసుకొస్తుంది. మేకర్స్ గా మాకు ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాం.→ ఈ సినిమాకు టికెట్ రేట్స్ పెంచడం లేదు. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ మా సినిమాకు టార్గెట్. వాళ్లంతా వచ్చి మా సినిమాను చూడాలి. టికెట్ రేట్స్ పెంచి వచ్చే కలెక్షన్స్ కన్నా, ఎక్కువమంది ఆడియెన్స్ మా సినిమాను చూస్తున్నారనేది సంతోషాన్నిస్తుంది. ప్రస్తుతం కొన్నిఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. వాటిని త్వరలో అనౌన్స్ చేస్తాను.


