మేం లాభాల్లోనే ఉన్నాం: సాయి రాజేష్‌ | Sai Rajesh on Chennai Love Story: Movie Enters Profit Zone with Rs 50 Cr Gross | Sakshi
Sakshi News home page

మేం లాభాల్లోనే ఉన్నాం: సాయి రాజేష్‌

Aug 7 2026 12:26 AM | Updated on Aug 7 2026 11:45 AM

Sai Rajesh about Chennai love story movie

‘‘నా దర్శకత్వంలో వచ్చిన ‘బేబి’ మూవీ తెలుగులో బ్లాక్‌బస్టర్‌ అయింది. ఈ మూవీ నా దర్శకత్వంలో హిందీలో రీమేక్‌ అవుతోంది. ఈ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమాకు నేను దర్శకత్వం వహించాలనుకోలేదు’’ అని సాయి రాజేష్‌ చెప్పారు. కిరణ్‌ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీప్రియ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘చెన్నై లవ్‌ స్టోరీ’. దర్శకుడు సాయి రాజేష్‌ కథ అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు.

సాయి రాజేష్, ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ సినిమా జూలై 24న విడుదలైంది. ఈ నేపథ్యంలో సాయి రాజేష్‌ గురువారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘చెన్నై లవ్‌ స్టోరీ’కి మొదటి రెండు రోజులు సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ ప్రచారం జరిగింది. వాకౌట్‌ అనే ప్రచారం చేశారు. నిజంగా ప్రేక్షకులు వాకౌట్‌ చేస్తే 50 కోట్ల రూపాయల వసూళ్లు దక్కవు కదా? మేం లాభాల్లోనే ఉన్నాం. ఇంటర్వెల్‌ సీన్‌ చూశాక నాకంటే రవి నంబూరి ఈ సినిమాను బాగా రూపొందించాడనే ఫీల్‌ కలిగింది.

నా డైరెక్షన్‌లోని ‘బేబి’ హిందీ రీమేక్‌ షూటింగ్‌ మరో 20 రోజులు బ్యాలెన్స్‌ ఉంది. సంపూర్ణేశ్‌ బాబుతో ‘హృదయ కాలేయం, కొబ్బరిమట్ట’ వంటి హిట్‌ మూవీస్‌ చేశాను. మా ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తాను. అక్టోబర్‌ తర్వాత నా దర్శకత్వంలో ఓ తెలుగు చిత్రం ప్రకటిస్తాను’’ అని తెలిపారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement