హరర్ థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అందుకే ఇలాంటి చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా మరో ఒళ్లు గగుర్పొడ్చే హారర్ థ్రిల్లర్ భయపెట్టేందుకు వచ్చేస్తోంది. ట్రైలర్ చూస్తేనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో మనం కూడా తెలుసుకుందామా?
సినీ ప్రియులను అలరించేందుకు సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇన్సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్ వచ్చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 21 థియేటర్లలో సందడి చేయనుంది. 2023లో వచ్చిన ఇన్సిడియస్ ది రెడ్ డోర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇన్సిడియస్ ఫ్రాంచైజీలో వస్తోన్న ఆరో సినిమా కావడం విశేషం. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ హారర్ థ్రిల్లర్‌కు జాకబ్ చేస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని సోనీ పిక్చర్స్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి.


