breaking news
Insidious: The Red Door Movie
-
'మీ పక్కలో దెయ్యం పడుకుంటే'.. ఒళ్లు గగుర్పొడ్చే ట్రైలర్ చూశారా?
హరర్ థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అందుకే ఇలాంటి చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా మరో ఒళ్లు గగుర్పొడ్చే హారర్ థ్రిల్లర్ భయపెట్టేందుకు వచ్చేస్తోంది. ట్రైలర్ చూస్తేనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో మనం కూడా తెలుసుకుందామా?సినీ ప్రియులను అలరించేందుకు సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇన్సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్ వచ్చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 21 థియేటర్లలో సందడి చేయనుంది. 2023లో వచ్చిన ఇన్సిడియస్ ది రెడ్ డోర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇన్సిడియస్ ఫ్రాంచైజీలో వస్తోన్న ఆరో సినిమా కావడం విశేషం. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ హారర్ థ్రిల్లర్‌కు జాకబ్ చేస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని సోనీ పిక్చర్స్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. -
హాలీవుడ్ హారర్ మూవీ ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ రిలీజ్ డేట్ ఇదే
హాలీవుడ్ హారర్ మూవీ ఇన్సిడియస్ ప్రాంచైజీ 5వ భాగంగా ఇన్సిడియస్: ది రెడ్ డోర్ రాబోతుంది. పాట్రిక్ విల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సోనీ పిక్చర్స్ ద్వారా జులై 6న ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇన్సిడియస్(2010), ఇన్సిడియస్ చాప్టర్ 2(2013)కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇన్సిడియస్ చాప్టర్ 2 ముగింపు తర్వాత అంటే ఆ సంఘటనలు జరిగిన పదేళ్ల తర్వాత ఈ చిత్రం కథ ప్రారంభం కానుంది. ది రెడ్ డోర్ స్టోరీ ఏంటంటే.. జోష్ లాంబెర్ట్ తన కొడుకు డాల్టన్‌ను ఒక ఇడిలిక్, ఐవీ-లీగ్ యూనివర్శిటీలో దింపడానికి వెళ్తాడు. ఆ యూనివర్శీటీ డాల్టన్‌కు ఓ పీడకలలా మారుతుంది. అతని చేత గతంలో అణచివేతకు గురైన రాక్షసులు అకస్మాత్తుగా వారిద్దరినీ వెంటాడేందుకు తిరిగి వస్తాయి. రాక్షసులను అంతం చేయడానికి, లాంబెర్ట్ పీడకలని ఆపడానికి జోష్, డాల్టన్ మరోసారి ఏమిచేశారు అనేదే ఈ మూవీ కథ. ఈ చిత్రంలో డాల్టన్ లాంబెర్ట్ గా టై సింప్కిన్స్, జోష్ లాంబెర్ట్ గా పాట్రిక్ విల్సన్, ఫోస్టర్ లాంబెర్ట్ గా ఆండ్రూ ఆస్టర్ నటించారు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ హారర్ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు భయపెడుతుందో చూడాలి.


