మీ ప్రయాణం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం: రామ్ చరణ్ | Ram Charan Responds On Megastar Chiranjeevi Cinema Journey | Sakshi
Sakshi News home page

Ram Charan: 'ఆ వేడుక కోసం వెయిటింగ్..' రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్

Sep 23 2026 8:29 PM | Updated on Sep 23 2026 8:44 PM

Ram Charan Responds On Megastar Chiranjeevi Cinema Journey

తన తండ్రి మెగాస్టార్ సినీ జర్నీపై తనయుడు రామ్ చరణ్ స్పందించారు. చిరంజీవి ట్వీట్‌కు మెగా హీరో రిప్లై ఇచ్చారు. సినిమా రంగంలో మీ ప్రయాణం మొదలుపెట్టి 48 ఏళ్లు అయ్యింది నాన్న అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. మీరు మన కుటుంబం, జీవితంలోనూ ప్రతీదీ మార్చేసిన ఆ రోజు మాకు ప్రతిరోజూ గుర్తొస్తుందన్నారు. మీరు చేసిన ప్రతీపనికి.. అలాగే మీకు నిరంతరం ప్రేమను, మద్దతు అందిస్తున్న ప్రేక్షకులకు నేను కృతజ్ఞురాడిని అంటూ ట్వీట్‌ చేశారు. మీ ప్రయాణం మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని.. సినిమా రంగంలో 50 ఏళ్లు అద్భుతమైన వేడుకను జరుపుకునే ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నానని పోస్ట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన హీరోగా రిలీజైన తొలి సినిమా ప్రాణం ఖరీదు. ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అభిమానుల ప్రేమ, మద్దతు వల్లే తాను ఈ రోజు ఇక్కడున్నాని చిరు భావోద్వేగానికి గురయ్యారు. మీరంతా ఎప్పటికీ కలిసుండాలని తన అభిమానులకు సూచించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement