సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Bollywood Thriller Movie Baby Do Die Do Now streaming on this Ott | Sakshi
Sakshi News home page

Thriller Movie: ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sep 23 2026 5:29 PM | Updated on Sep 23 2026 6:29 PM

Bollywood Thriller Movie Baby Do Die Do Now streaming on this Ott

ఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటోంది. ఆడియన్స్‌ అభిరుచికి తగ్గట్టుగానే ప్రతివారం కొత్త థ్రిల్లర్ మూవీస్ సందడి చేస్తుంటాయి. ఇటీవల రిలీజై బాక్సాఫీస్ వద్ద మెప్పించిన డార్క్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌ బేబీ డూ డై డూ. ఈ మూవీలో బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీ కీలక పాత్రలో కనిపించారు.

తాజాగా ఈ సినిమా ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి నచికేత్ సమంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఒక మూగ, చెవిటి అమ్మాయి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. చిన్నతనంలో తన కళ్ల ముందే దారుణంగా హత్యకు గురైన తన ట్విన్ సిస్టర్ చావుకు పగ తీర్చుకునే కథే ఈ మూవీ. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. ఈ చిత్రంలో సికందర్ ఖేర్, చుంకీ పాండే కీలక పాత్రల్లో నటించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement