బాలీవుడ్‌లో గోవిందా- సునీత ఎపిసోడ్ ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పటికే తన భర్తపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సునీతా.. తాజాగా తన కామెంట్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ గోవిందా తన సహనటి రాణి స్వర్ణకర్‌తో గత కొన్ని రోజులుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతన్నారు. వీరిద్దరిని చూసిన ప్రతిసారి సునీతా విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా గోవిందా తన గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రాణి స్వర్ణకర్‌తో కలిసి ముంబైలోని లాల్‌బాగ్‌చా వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ వీడియోలు సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇది జరిగిన ఒకరోజు వ్యవధిలోనే ఆయన భార్య సునీతా అహుజా స్పందించారు. గోవిందా పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా కౌంటరిచ్చారు. ఈ కాలం మనుషులు పెద్ద మోసగాళ్లని విమర్శించింది. మీరు మానవులను ఎంతగా ప్రేమించినా ప్రయోజనం లేదని పేర్కొంది. అందుకే మనుషులను ప్రేమించడం ఆపేసి.. జంతువులను ప్రేమించాలని ప్రజలను కోరింది. అవే ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాయని సునీతా వెల్లడించింది.
అయితే నటుడు గోవిందా గానీ.. కోమల్ గానీ తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని ఎక్కడా ధృవీకరించలేదు. వీరిద్దరు కలిసి నటించిన 'రూపా' సినిమా విడుదలకు సిద్ధమైంది. సినిమా కోసమే వీరిద్దరు జంటగా కనిపిస్తూ సందడి చేశారు. ఆ తర్వాత వీరిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీరిని సన్నిహితంగా ఉండడం చూసిన సునీతా తన భర్తపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.


