ది ప్యారడైజ్.. అదే జరిగితే నాని కెరీర్‌లోనే బెస్ట్‌..! | Nani's The Paradise set for career best opening on Day 1 | Sakshi
Sakshi News home page

The Paradise Movie: ది ప్యారడైజ్.. అదే జరిగితే నాని కెరీర్‌లోనే బెస్ట్‌..!

Sep 23 2026 2:43 PM | Updated on Sep 23 2026 3:02 PM

Nani's The Paradise set for career best opening on Day 1

నాని హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం ఈ రోజు సాయంత్రం నుంచే థియేటర్లలో అలరించనుంది. స్పెషల్ ప్రీమియర్ షోలతో జడల్ జమానా షురూ కానుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ క్రేజ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. మొదటి రోజు రూ. 18.16 కోట్ల గ్రాస్‌ వసూళ్లు నమోదు చేసింది.  ఈ మూవీకి 6,849 షోలతో దాదాపు  8.50 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో తెలంగాణలో రూ. 9.14 కోట్లు కాగా.. ఆంధ్రప్రదేశ్ రూ.5.63 కోట్లు, కర్ణాటక రూ.2.01 కోట్లు, తమిళనాడు రూ.68.54 లక్షలు, మహారాష్ట్ర రూ. 20.61 లక్షలు సాధించింది.

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ డేటా ప్రకారం ఈ మూవీ మొదటి రోజే రూ.60 కోట్లకు గ్రాస్ పైగా వసూళ్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఇదే జరిగితే నాని కెరీర్‌లోనే ది బెస్ట్ ఓపెనింగ్ వసూళ్లు సాధించిన చిత్రంగా ది ప్యారడైజ్ నిలవనుంది. 


నాని సినిమాల మొదటి రోజు వసూళ్లు

  • సరిపోదా శనివారం- రూ.24.11 కోట్లు

  • దసరా- రూ.38 కోట్లు

  • హిట్: ది థర్డ్ కేస్- రూ.43 కోట్లు

  • ది ప్యారడైజ్- రూ.50-60 కోట్లు(అంచనా)
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement