నాని 'ప్యారడైజ్' సినిమాకి సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. కాబట్టి ఫ్యామిలీస్ ఈ మూవీకి దూరంగానే ఉంటారు. అంటే పెద్దోళ్లు, యూత్ మాత్రమే ఈ చిత్రాన్ని ఆదరించాలి. పాటలతో ఇప్పటికే మంచి బజ్ తీసుకొచ్చారు. ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంతో స్టోరీ ఏమై ఉండొచ్చని డిస్కషన్స్ సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. మిగతా భాషల సంగతేమో గానీ తెలుగు రాష్ట్రాల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగానే ఉన్నాయి. ఇక మిగిలింది కంటెంట్ రిజల్ట్ మాత్రమే.
(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా.. కొడితే కుంభస్థలం లేదంటే మాత్రం?)
సరే ఈ సంగతులన్ని పక్కనబెట్టెస్తే 'ప్యారడైజ్' సినిమాని నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దాదాపు రూ.90 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక రెమ్యునరేషన్స్ కూడా గట్టిగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో జడల్ అనే పాత్రలో నటించినందుకుగానూ నాని ఏకంగా రూ.30-35 కోట్ల మధ్య పారితోషికం అందుకున్నట్లు టాక్.
సికంజా మాలిక్ అనే విలన్‌గా చేసిన సీనియర్ నటుడు మోహన్ బాబుకు రూ.5 కోట్లు, 'యేషనాగుల' అనే స్పెషల్ సాంగ్‌లో నర్తించిన కీర్తి సురేశ్‌కి రూ.కోటి, సుబ్బు అని హీరోయిన్ పాత్ర చేసిన కాయదు లోహర్‌కి రూ.1.5 కోట్లు, విక్రమ్ మాలిక్ అనే మరో విలన్‌గా చేసిన బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయెల్‌కి రూ.2-2.5 కోట్లు, బిర్యానీ అని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన సంపూర్ణేశ్ బాబుకి రూ.38 లక్షలు, ఇక ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతమందించిన అనిరుధ్ రవిచందర్‌కి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'ప్యారడైజ్'.. నాని కోరిక తీరడం కష్టమే)


