లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, హైవే, మై వాపస్ ఆవుంగా తదితర భగ్న ప్రేమకథా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ శుభవార్త చెప్పేశాడు. తన కూతురు ఇదా అలీకి ముంబైలో మంగళవారం సాయంత్రం నిశ్చితార్థం జరిగిన సంగతి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించాలని కోరాడు.
(ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక)
ఇదా అలీ కూడా తండ్రి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. దర్శకురాలిగా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఈమె గత కొన్నేళ్లుగా కృష్ణ్ అగర్వాల్ అనే కుర్రాడితో ప్రేమలో ఉంది. ఈ ఏడాది జూలై 01న నార్వేలోని ఓ బీచ్ దగ్గర క్రిష్ మోకాళ్లపై కూర్చుని ఇదాకు ప్రపోజ్ చేశాడు. తర్వాత వజ్రాల ఉంగరం తొడిగాడు. అప్పుడు ప్రపోజ్ చేయగా.. ఇప్పుడు పెద్దలు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకునే అవకాశముంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అన్యాయం చేసిన ముకేశ్.. కుమిలి కుమిలి ఏడ్చిన దేబ్జానీ)



