ఏడు వారాలైనా అదే జోరు.. హనుమాన్ అంశ్‌కి ఎన్ని కోట్లంటే? | Hanuman Ansh box office collections on Day 43 | Sakshi
Sakshi News home page

Hanuman Ansh: బాక్సాఫీస్ వద్ద హనుమాన్ అంశ్‌.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Sep 19 2026 4:27 PM | Updated on Sep 19 2026 4:38 PM

Hanuman Ansh box office collections on Day 43

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన మూవీ 'హనుమాన్ అన్ష్'. ఈ సినిమా మౌత్ టాక్‌తోనే కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రిలీజై ఏడు వారాలైనప్పటికీ వసూళ్లపరంగా ఇంకా రాణిస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.316 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఇండియాలో రూ. 293 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించిన ఈ మూవీ.. రూ.248 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ 43వ రోజున సైతం 18 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. సెప్టెంబర్ 18న రూ. 6.25 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఈ సినిమాకు  విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో శోభినవ్ సత్య, చందన్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ రస్తోగి, సుగంధ మల్హోత్రా, భగవందాస్ పటేల్, నేహా పరంజపే, విహాన్ షెడ్గే ముఖ్య పాత్రలు పోషించారు. స్వాతంత్ర్యానికి పూర్వం తల్లి మరణానంతరం ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరిన లక్ష్మీ నారాయణ్ అనే యువకుడి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. దేవుడి అన్వేషణలో ఉత్తర భారతదేశమంతటా పర్యటించిన అతడు.. చివరికి నీమ్ కరోలి బాబాగా మారుతాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement