టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దీనికి తగ్గట్టుగానే మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఈ తరహాలోనే ఇటీవల బెంగళూరులోనూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నానీకి ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.
మీరు చెప్తే ఎవరు వింటారు
నాని మీడియా సమావేశంకి వచ్చిన ఓ లేడీ జర్నలిస్ట్‌ని చూసి.. ‘మీ హెయిర్ చాలా బాగుంది. ప్రస్తుతం హెయిర్ ఫాల్ అవుతోంది. జాగ్రత్తగా ఉండండి. నాలా జడలు పెట్టుకోండి అని పోస్టర్‌ని చూపిస్తూ సరదాగా అన్నారు. దీనికి స్పందించిన వేరే కన్నడ మహిళా జర్నలిస్ట్ ‘మీరు జడలు పెంచుకొని చెప్తే మీము వింటాం. కానీ మీరు జడలు పెట్టుకున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ( బెంగళూరు)కి వచ్చి చెప్తే ఎవరు వింటారు’ అని నానిని ప్రశ్నించారు.
సినిమాలో ఫేక్‌గా ఏడుస్తా..
‘నేను యాక్టర్‌ని అందుకే ఇలా చెప్పా.. మీరు జీవితంలో నిజంగా ఏడుస్తారు. నేను సినిమాలో ఫేక్‌గా ఏడుస్తా.. అందుకే ఇలా చూపించి చెప్పా అని కౌంటర్‌ని కవర్ చేస్తూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ లేకుండా నేరుగా థియేటర్లలోకి వస్తుండడంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అనిరుద్ సంగీతం అందించాడు. మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
A Kannada Journalist’s QUESTION to #NANI :
“మీరు #TheParadise లో lo JADAL పెంచుకుని చెప్తే పర్లేదు…
మీరు WIG పెట్టుకుని, మాకు ఎలా చెప్తున్నారు…?”
That CRAZY Response from the Crowd to #Nani’s Answer… 😂🔥 pic.twitter.com/0k9xXsqEl0— Rangasthalam (@RangasthalamIN) September 18, 2026


