బన్నీ ‘రాకా’.. ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేది ఎప్పుడంటే.. | Allu Arjun Raaka First Glimpse Release Date Update | Sakshi
Sakshi News home page

Raaka Glimpse: ‘రాకా’.. ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేది అప్పుడేనా..

Sep 19 2026 11:31 AM | Updated on Sep 19 2026 11:41 AM

Allu Arjun Raaka First Glimpse Release Date Update

అల్లు అర్జున్‌, స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకా’. పాన్ వరల్డ్ మైథలాజికల్ విజువల్ వండర్ గా రూపొందుతోంది. అయితే రాకా నుంచి బిగ్‌ అప్డేట్‌ త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్  చేసినట్లు సమాచారం.  అయితే ఈ  అప్‌డేట్‌పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  (ఇదీ చదవండి: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు)
37 అనే క్రిప్టిక్‌ పోస్టర్‌ను..
ఇటీవలే 37 అనే క్రిప్టిక్‌ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ స​ంస్థ సన్‌ పిక్చర్చ్‌ షేర్‌ చేయడంతో అభిమానుల్లో ఇంతటి ఆసక్తి నెలకొంది. అయితే ఈ నెల 21న అట్లీ పుట్టినరోజు కావడంతో ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు. దీన్ని చూస్తుంటే హాలీవుడ్‌ రేంజ్‌లో ఓ సరికొత్త విజువల్స్‌తో వేరే ప్రపంచాన్ని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా  ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోనే కీలక పాత్రలో కనిపించనుంది. ఈమెకు సంబంధించిన షూటింగ్‌ ఇప్పటికే పూర్తి చేసినట్లు టాక్‌.  
రష్మిక మందన్న నెగిటివ్‌ రోల్‌ లో కనిపించబోతున్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా ఈ సినిమా 2028లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌ ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement