బిగ్‌బాస్‌ తొలి కెప్టెన్‌ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ | Bigg Boss 10 Telugu Day 13, Sep 18th 2026 Full Episode Highlights: Jhansi Becomes The New Captain Of The Bigg Boss House | Sakshi
Sakshi News home page

Bigg Boss10 Highlights: నరేశ్‌ సూరీడు స్కిట్‌ అదుర్స్.. తొలి కెప్టన్‌గా ఝాన్సీ

Sep 19 2026 7:45 AM | Updated on Sep 19 2026 12:08 PM

Biggboss10 Telugu Day 13 Episode Highlights

బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ రేసు ఆసక్తికరంగా సాగింది. ఓవైపు కంటెస్టెంట్లు కెప్టెన్‌ అయ్యేందుకు పోటీపడుతుండగా.. మరోవైపు హౌస్‌లో నవ్వులు పూయించేలా కామెడీ స్కిట్‌ చేశారు. రాంప్రసాద్‌, నరేశ్‌, వంశీ, రోహిత్‌, అమన్‌ కలిసి ‘ఛత్రపతి’ సినిమాలోని ‘ఓ సూరీడు’ కామెడీ సీన్‌ను రీక్రియేట్‌ చేశారు. మరి నిన్నటి ఎపిసోడ్‌లో ఝాన్సీ కెప్టెన్‌ ఎలా అయిందో ఒకసారి చూద్దాం రండి!

ఓ సూరీడు.. అదిరిపోయిన స్కిట్‌
స్కిట్‌లో వంశీ ప్రభాస్‌ పాత్రలో కనిపించగా.. రాంప్రసాద్‌ చిన్న పిల్లాడు సూరీడుగా అలరించాడు. నరేశ్‌ రౌడీ కాట్రాజ్‌ పాత్రలో నటించాడు. అమన్‌ వంశీ ఫ్రెండ్‌గా కనిపించగా.. ఝాన్సీ సూరీడు తల్లి పాత్రలో నటించింది. సినిమా సీన్‌ను హౌస్‌మేట్స్‌ తమదైన శైలిలో రీక్రియేట్‌ చేయడంతో స్కిట్‌ మొత్తం నవ్వులు పూయించింది. స్కిట్‌ పూర్తయ్యాక బిగ్‌బాస్‌ కూడా మంచి మార్కులే ఇచ్చాడు. స్కిట్‌ బాగుంది.. కానీ నరేశ్‌ కాట్రాజ్‌ పాత్రలో కండలు మరీ ఎక్కువగా చూపించాడంటూ సరదాగా కామెంట్‌ చేశాడు. అలాగే రాంప్రసాద్‌ను ఉద్దేశించి సూరీడు మరీ పసిపిల్లాడిలా అయిపోయాడంటూ జోక్‌ చేశాడు.

ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌ ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

‘చిక్కకు దొరకకు’.. కెప్టెన్సీ టాస్క్‌
ఆ తర్వాత కెప్టెన్సీ రేసులో ఉన్న ముకేశ్‌, షాలిని, ఝాన్సీ, రాంప్రసాద్‌, త్రిగుణ్‌లకు బిగ్‌బాస్‌ ‘చిక్కకు దొరకకు’ అనే టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో మిగిలిన పది మంది గార్డులుగా వ్యవహరించాలి.  ఈ ఐదుగురు పోటీదారులు జైలులో ఉండాలి. గార్డుల నుంచి తప్పించుకుని గోడ దాటి సేఫ్‌ జోన్‌లోకి చేరుకోవాల్సి ఉంటుంది. సేఫ్‌ జోన్‌లోకి చేరుకోలేని పోటీదారులు కెప్టెన్సీ రేసు నుంచి ఎలిమినేట్‌ అవుతారు. ఈ టాస్క్‌లో వంశీ, రోహిత్‌ హెడ్‌ గార్డులుగా వ్యవహరించారు. టాస్క్‌ ప్రారంభానికి ముందు ఐదుగురు పోటీదారులు తాము ఎందుకు కెప్టెన్‌ కావాలనుకుంటున్నారో వివరించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరూ కెప్టెన్‌ అయితే హౌస్‌లో ఏం చేస్తారో చెప్పారు. 

ఇదీ చదవండి: మహిళల అభివృద్ధికి సినీ సెలబ్రిటీల సంచలన నిర్ణయం

బయట ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తమ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినట్టుగానే.. హౌస్‌లోని కంటెస్టెంట్లు కూడా తాము కెప్టెన్‌ అయితే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ హామీలు ఇచ్చారు. దీంతో వారి చిన్నపాటి ‘కెప్టెన్సీ మేనిఫెస్టో’ ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత గార్డులు తమ నిర్ణయం ప్రకారం చివరికి రాంప్రసాద్‌, ఝాన్సీలను కెప్టెన్సీ పోటీలో నిలిపారు. దీంతో వీరిద్దరి మధ్య చివరి పోటీ ఆసక్తికరంగా మారింది.

ఝాన్సీనే కొత్త కెప్టెన్‌
రాంప్రసాద్‌, ఝాన్సీలకు బిగ్‌బాస్‌ ‘పవర్‌ ఆఫ్‌ కెప్టెన్సీ’ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌కు త్రిగుణ్‌ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఇద్దరు పోటీదారుల ముందు ఇనుప నెట్‌ను ఏర్పాటు చేశారు. పట్టకర్రతో ఆ నెట్‌ను తొలగిస్తూ లోపలికి వెళ్లాలి. అక్కడ ఉన్న పెట్టెలోని కీని తీసుకుని.. అందులో ఉన్న చిన్న మూటను తీసుకోవాలి. ఆ మూటలో ఉన్న ‘C’ అనే లెటర్‌ను జెండాకు అతికించి.. ఆ తర్వాత కెప్టెన్‌ జెండాను ఎగరేయాలి. ఈ టాస్క్‌లో రాంప్రసాద్‌పై ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్‌బాస్‌ హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా ఝాన్సీ నిలిచింది. కెప్టెన్‌గా ఎంపికైన ఝాన్సీకి వైట్‌ గోల్డ్‌ సంస్థ.. లక్ష విలువైన గోల్డ్‌ కాయిన్‌ బహుమతిగా అందించింది. అనంతరం ఝాన్సీ కోసం ప్రత్యేకంగా కెప్టెన్సీ గదిని కూడా బిగ్‌బాస్‌ ఓపెన్‌ చేశాడు. అయితే ఆ రూంలో కెప్టెన్‌కి మాత్రమే ప్రవేశం ఉంటుందని గుర్తుచేశాడు. 

ఇదీ చదవండి: ‘ఆయా షేర్‌’ రీల్స్‌ కోసం లక్ష జడలు కొన్నారు: నాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement